Search
Tuesday 20 November 2018
  • :
  • :

సెమీస్‌లో సానియా జంట

Sania-Mirza

రోమ్: భారత స్టార్ సానియా మీర్జా-యరొస్లావా ష్వెదొవా (కజకిస్థాన్) జోడీ ప్రతిష్టాత్మకమైన ఇటలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. మూడో సీడ్ సానియా జోడీ క్వార్టర్ ఫైనల్లో 6-4, 6-1 తేడాతో ఇటలీ జంట మార్టినా ట్రెవిసన్, సారా ఎరాని జం టని ఓడించింది. ప్రారంభం నుంచే సానియా జంట మ్యాచ్‌లో ఆధిప త్యం చెలాయించింది. ఇద్దరు సమ న్వయంతో ఆడుతూ ప్రత్యర్థి జోడీని ఒత్తిడికి గురి చేశారు. ఇటలీ జోడీ కూడా కాస్త ప్రతిఘటన ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు ఏకాగ్రతతో ఆడిన సానియా జోడీ మొదటి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో అయితే సానియా జంటకు ఎదురులేకుండా పోయింది. ప్రత్యర్థి జోడీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ 6-1 తేడాతో సెట్‌ను దక్కించుకుని సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. సెమీస్‌లో సానియా జంట మార్టినా హింగిస్-చాన్ యంగ్ జాన్ జోడీతో తలపడుతుంది. మరోవైపు పురుషుల డబుల్స్ భారత స్టార్ రోహన్ బోపన్న జోడీకి చుక్కెదురైంది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న-పాబ్లొ క్యూవస్(ఉరుగ్వే) జంట 6-7, 7-6, 10-12 తేడాతో నాలుగో సీడ్ హార్బర్ట్-నికొలస్ మహుత్ జంట చేతిలో పోరాడి ఓడింది.

Comments

comments