న్యూయార్క్: యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా(ఇండియా)-బార్బరా స్టిక్రోవా(చెక్ రిపబ్లిక్) జోడి క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి పాలైంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్ర తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఫ్రెంచ్ ద్వయం కరోలిన్ గార్సికా-క్రిస్టినా మ్లడెనోవిక్ చేతిలో 7-6,6-1 తేడాతో సానియా జోడి పరాజయం పొందింది. తొలి సెట్లో అద్భుతంగా పోరాడినా సానియా-స్ట్రికోవా ద్వయం రెండో సెట్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. దీంతో యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ఫ్రెంచ్ జోడీ అలవోకగా విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది.