Search
Tuesday 20 November 2018
  • :
  • :

ఫ్రెంచ్ ఓపెన్ నుంచి సాంటినా జోడి నిష్క్రమణ

Sania-and-Hingisపారిస్: సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడి ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. సాంటినా జోడికి మూడవ రౌండ్‌లో చెక్‌రిపబ్లిక్ జంట షాకిచ్చింది. ప్రపంచ నెం.1 జోడియైన సానియా-హింగిస్‌లు 3-6, 2-6 స్కోర్‌తో బార్బొరా క్రెజికోవా- కత్రినా సినియకోవా చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ పరాజయంతో సాంటినా జోడి వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచే అవకాశాన్ని కోల్పోయినట్లయింది. 2015లో వింబుల్డన్, యుఎస్ ఓపెన్ గెలిచిన ఈ జోడి 2016 మొదట్లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను కూడా గెలిచారు.

Comments

comments