Search
Monday 24 September 2018
  • :
  • :

ఫ్రెంచ్ ఓపెన్‌కు సానియా మీర్జా దూరం!

anu

గ్రేటర్ నోయిడా: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్‌కు దూరం కానుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడంతో తాను మరో రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉండక తప్పడం లేదని సానియా పేర్కొంది. ఇప్పటికే సానియా ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు మరో రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్‌లో సానియా బరిలోకి దిగడం దాదాపు అసాధ్యంగా మారింది. ఇదే విషయాన్ని ఆదివారం సానియా సూచన ప్రయంగా వెల్లడించింది. గాయం తనను వెంటాడుతోందని, శస్త్ర చికిత్స చేసుకున్న ఈ బాధ నుంచి ఇంకా బయట పడలేక పోతున్నానని వాపోయింది. 2016లో సానియా వరుస గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకుని ప్రపంచ టెన్నిస్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే కిందటి ఏడాది గాయాలు సానియాను వెంటాడాయి. దీంతో ఆమె చాలా టోర్నీలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఏడాది మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని భావించిన హైదరాబాదీ స్టార్‌కు గాయాలు వీడడం లేదు. దీంతో మరి కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, ఆదివారం ఇక్కడ ఓ స్పోర్ట్ అకాడమీని ప్రారంభించేందుకు వచ్చింది.

Comments

comments