Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు సానియా పేరు

ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్, భారత నెం.1 టెన్నిస్ క్రీడాకారిణి సానియా  పేరును సిఫార్సు చేసినట్లు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ శనివారం స్పష్టం చేసింది. ఆమె డబుల్స్ లో ప్రపంచ నెం.1 ర్యాంకు సొంతం చేసు కున్నారు. స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ జతగా వింబుల్డన్ డబుల్స్ టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు.

sania-mirza_manatelanganaన్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్, భారత నెం.1 టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా పేరును సిఫార్సు చేసినట్లు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ శనివారం స్పష్టం చేసింది. 2014-15 సీజన్‌లో దేశం గర్వించదగిన విజయాలు సాధిం చిన సానియామీర్జాను ఖేల్త్న్రకు ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్(ఎఐటిఎ) ప్రతిపాదిం చకపోయానా క్రీడాశాఖే తమ సొంత నిర్ణయంగా ఈ అవార్డుకు నామినేట్ చేసింది. ‘ఖేల్త్న్రకు సానియామీర్జా పేరును ఎఐటిఎ ప్రతిపాదించ కపోయినా ఈ అవార్డు పొందేందుకు ఆమె అన్ని రకాల అర్హతలు కలిగి ఉండడంతో అవార్డు కమి టీకి సిఫార్సు చేశాం. అయితే ఖేల్త్న్ర అవార్డుకు ఎవరిని ఎంపిక చేయాలో నిర్ణయం తీసుకునేది మాత్రం అవార్డు కమిటీదే’అని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజిత్ శరన్ తెలిపాడు. ఖేల్త్న్ర అవార్డు రేసులో సానియాతో పాటు స్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ ఉన్నారు.
గతేడాదిగా అతుత్తమ ఫామ్‌లో ఉన్న సానియా మహిళల డబుల్స్‌లో ప్రపంచ నెం.1 ర్యాంకు సొంతం చేసుకోవడమేకాక, స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ జతగా వింబుల్డన్ డబుల్స్ టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఇక 2014 ఆసియన్ గేమ్స్‌లో సాకేత్ జతగా మిక్స్‌డ్ డబుల్స్‌లో, ప్రార్థన తొంబారె జతగా మహిళల డబుల్స్ స్వర్ణం నెగ్గిన సానియా అదే ఏడాది యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Comments

comments