Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఆర్మీ, ఆయుధ సంపత్తి… ప్రదర్శన కోసమే ఉందా…

Shiva-Sena

ముంబయి: ఇండియన్ ఆర్మీ, ఆయుధ సంపత్తిపై శివసేన నేత సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్- పాక్ సరహద్దుల వెంబడి పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. భారత్ వద్ద ఆయుధాలున్నాయి, పాక్ వద్ద ఆయుధాలున్నాయి, కానీ భారత జవాన్లను పాక్ రేంజర్లు హత్య చేస్తున్నారని మండిపడ్డారు.  ఆయుధ సంపత్తిని రాజ్ పథ్ లో  ప్రదర్శన కోసమే ప్రభుత్వం  ఉంచుతుందని రౌత్ ఎద్దేవా చేశారు.  గణతంత్ర దినోత్సవ వేడుకలలో విదేశాల నుంచి వచ్చే అధినేతల, ప్రతినిధుల సమక్షంలో  ఇండియన్ ఆర్మీ తన ఆయుధాలను ప్రదర్శించి ప్రశంసలు పొందడానికే ఉందా అడిగారు. తాజాగా పాక్ రేంజర్ల కాల్పుల్లో ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి, ముగ్గురు జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.

Comments

comments