Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘సంజు’కు రూ.500 కోట్లు

Sanju

బాలీవుడ్ మూవీ ‘సంజు’ మేనియా రెండో వారం కూడా కొనసాగింది. మొదటి వారం రికార్డు వసూళ్లు సాధించిన ఈ సినిమా రెండో వారం గడిచేసరికి ఏకంగా 500 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా మూడో వారంలోకి ప్రవేశించింది. రణబీర్‌కపూర్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంజు’ సినిమాకు తొలి వారమే 200 కోట్లు వచ్చాయి. తాజాగా 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల 43 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. రెండు వారాల్లో ఇండియాలో ఈ సినిమాకు 378.43 కోట్లు వచ్చాయి. సంజయ్‌దత్ జీవితంలోని కీలక ఘట్టాలను టచ్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్ పరంగా విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఎమోషనల్‌గా ప్రేక్షకులు అందరికీ కనెక్ట్ అయింది. వచ్చే వీకెండ్ కూడా బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం ‘సంజు’కు కలిసొచ్చే అంశం.

Comments

comments