Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

‘బాహుబలి-2’ను దాటిన ‘సంజు’

sanju

‘బాహుబలిః ది కంక్లూజన్’ సినిమా వసూళ్లు చూశాక దాన్ని కొట్టే సినిమా ఇండియాలో రావడం కష్టమేనని అందరూ అనుకున్నారు. ఎన్నో అంచనాలతో వచ్చిన సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్ సినిమాలు బాహుబలి రికార్డులను బద్దలు కొట్టలేకపోయాయి. అయితే ఇప్పుడు యంగ్ స్టార్ రణబీర్‌కపూర్, టాప్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్‌లో వచ్చిన ‘సంజు’ సినిమా కొత్త రికార్డును సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన తొలి రోజే రూ.34.75 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఈ ఏడాది ఫస్ట్‌డే హయ్యస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అయితే తొలిరోజు ‘బాహుబలి-2’ రికార్డును అందుకోలేకపోయిన ‘సంజు’ మూడో రోజు మాత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆ రోజున అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ‘బాహుబలి-2’ పేరిట ఉన్న రికార్డును అది బద్దలు కొట్టేసింది. మూడో రోజున ‘బాహుబలి-2’ రూ. 46.50 కోట్లతో రికార్డు నెలకొల్పగా… దాన్ని స్వల్ప తేడాతో ‘సంజు’ అధిగమించింది. ఈ చిత్రానికి ఆదివారం రూ.46.71 కోట్ల గ్రాస్ వచ్చింది. రణబీర్‌లాంటి హీరోతో ఇలాంటి రికార్డు కొట్టిన రాజ్‌కుమార్ హిరానీకి సెల్యూట్ కొట్టాల్సిందే. ‘సంజు’ మూడు రోజుల్లో మొత్తంగా రూ.120 కోట్ల మార్కును దాటడం విశేషం. ఫుల్ రన్‌లో ఈ చిత్రం సునాయాసంగా రూ.300 కోట్ల మార్కును దాటేస్తుందని… ఈ ఏడాది హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Comments

comments