Home తాజా వార్తలు ‘సంజు’గా రణబీర్ అదరగొట్టాడు…(టీజర్)

‘సంజు’గా రణబీర్ అదరగొట్టాడు…(టీజర్)

Sanju Official Teaser out now

ముంబయి: బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ టీజర్ విడుదలైంది. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్.. సంజయ్‌దత్ పాత్ర పోషించారు. 1.25 నిమిషాలున్న ఈ టీజర్‌లోరణబీర్.. సంజయ్ పాత్ర పోషించాడు అనడం కంటే జీవించాడు అన్నంతగా లీనమైపోయాడు. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మూవీని తెరకెక్కిస్తున్నారు. సంజయ్ జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనల ఆధారం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంజయ్‌దత్ భార్య మాన్యత పాత్రలో దీయా మీర్జా నటించగా, సంజయ్ తల్లిగా సీనియర్ నటి మనీషా కొయిరాలా కనిపించనున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో అనుష్కా శర్మ, పరేష్ రావెల్, సోనమ్ కపూర్ తదితరులు నటించారు. జూన్ 29న మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.