Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

శాంసన్ సెంచరీ… వార్మప్ మ్యాచ్ డ్రా

Sanju-Samson

కోల్‌కతా: భారత పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు, భారత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య రెండు రోజుల వార్మప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి రోజు ఆటలో శ్రీలంక ఆటగాళ్లు రాణించగా, రెండో రోజు ఆటలో భారత జట్టు బ్యాట్స్‌మెన్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకేయులు తొలి ఇన్నింగ్స్ ను 411/6 వద్ద డిక్లేర్డ్ చేశారు. అనంతరం ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో బోర్డు ప్రెసిడెంట్స్ ఆటగాడు సంజూ శాంసన్(128: 19 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో కదంతొక్కాడు. శాంసన్‌తో పాటు జీవన్ జోత్ సింగ్(35), రోహమ్ ప్రేమ్(39), సందీప్(33 నాటౌట్), జలాజ్ సక్సేనా(20 నాటౌట్)లు కూడా రాణించడంతో ఆట ముగిసే సమయానికి ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. శ్రీలంక బౌలర్లలో తిరుమన్నె 2 వికెట్లు, సమరవిక్రమ ఒక వికెట్ పడగొట్టారు.

Comments

comments