Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

తుంగతుర్తికి సాగు నీరిచ్చే ప్రాజెక్టు  ఏది: సంకినేని

Sankineni  Speech About Kaleshwaram Project

తుంగతుర్తి: తుంగతుర్తి ప్రాంతానికి సాగు నీరందించే విషయంలో ఇటు అధికార టిఆర్‌ఎస్ ,అటు విపక్ష బిజెపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాళేశ్వరం పూర్తయితే మేడిగడ్డ ,మిడ్‌మానేర్ లద్వారా తుంగతుర్తి ప్రాంతానికి రెండు పంటలకు సాగునీరందుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తో పాటు అధికార పార్టీ మంత్రులు చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయినా తుంగతుర్తి ప్రాంతానికి సాగు నీరు రానేరాదని ,ఇది తుంగతుర్తి ప్రాంత ప్రజలను మోసం చేసే మాటలని,బిజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ,తుంగతుర్తి మాజీ శాసన సభ్యులు సంకినేని వెంకటేశ్వర్ రావు చెప్పడమే కాకుండా తాము ఈ విషయం పై బహిరంగ చర్చ కైనా సిద్ధమని ,ఒక వేళ తమ వాదన తప్పయితే తుంగతుర్తి ,సూర్యాపేట ,కోదాడ లలో బిజెపి పోటీ చేయదని సవాల్ చేస్తున్నారు. దీనికి ప్రతిగా టిఆర్‌ఎస్ ప్రధాన నాయకులు ఎవరూ అంతగా స్పందించలేదు కాని, ద్వితీయ శ్రేణి నుండి సంకినేని మాటలపై ఖండనలు పత్రికల్లో వస్తున్నాయి. తుంగతుర్తిలో 6వ తేదీన నిర్వహించే బహిరంగ సభా వేదిక నుండే కాళేశ్వరం ,మేడిగడ్డ ద్వారా సాగు నీరు రాదనే మాట ప్రజలకు తెలియ చెప్పడమే కాదు,తమ సవాల్‌ను కూడా అధికార పార్టీకి విసురుతామని సంకినేని ఇప్పటికే పలు సమావేశాల్లో చెప్తున్నారు.

కంతన పల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగితేనే తుంగతుర్తి ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని సంకినేని వాదన, కాదు కాళేశ్వరం పూర్తయితేనే తుంగతుర్తి ప్రాంతానికి సాగునీరందుతుందని టిఆర్‌ఎస్ వాదన ,ఇరువురి వాదనలు ఒకరి పై ఒకరు సంధిస్తున్న విమర్శనాస్త్రాలు రోజు పత్రికల్లో పేలుతున్నాయి. శ్రీరాం సాగర్ వరద కాలువ రెండవ దశ పూర్తయితే తుంగతుర్తికి సాగునీరు వస్తుందనే మాట గతంలో చెప్పారు,కాలువలు తవ్వారు ,కానీ నీరు రాలేదు. తిరిగి నేడు ఒకరు కాళేశ్వరం ,మేడిగడ్డ ,మరొకరు కంతన పల్లిఅని విరుద్ధ ప్రకటనలు చేస్తూ సవాల్ విసురుకుంటున్నారు. అసలు తుంగతుర్తికి సాగునీరు కాళేశ్వరంతో వస్తాయా?కంతన పల్లితోనా అనేది తుంగతుర్తి ప్రాంత రైతులను అయోమానికి గురి చేస్తోంది. సాగు నీరు ఎలా వస్తుందో ,ఎక్కడినుండి వస్తోందో తెలియదుకాని తమకు సాగు నీరు రావాలని రైతులు అంటున్నారు.

అధికార ,విపక్ష నేతల మాటల యుద్ధం ఏమేరకు ఎవరి వాదన నిజం కానుందో తెలియాలంటే మరెన్ని సంవత్సరాలు గడవాలో ననేది చర్చనీయాంశంగా మారింది. ఈనెల 6న బిజెపి నిర్వహించే బహిరంగ సభకు భారీ జన సమీకరణ చేసే పనిలో సంకినేని నిమగ్న మాయ్యరు .తన రాజకీయ భవితవ్యానికి ,తుంగతుర్తి బహిరంగ సభకు లింకు ఉందనేది సంకినేని భావన.బహిరంగ సభ విజయ వంతం అయితేనే తుంగతుర్తి పై పట్టు సాధించవచ్చని ,గతంలో సూర్యాపేటలో అమిత్‌షా రాక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ సక్సెస్‌లో సూర్యాపేటలో పట్టు సడల లేదని సంకినేనినిరూపించుకున్నారు. ప్రస్తుతం జరిగే బహిరంగ సభ పేరుకు జన చైతన్య యాత్ర ముగింపు సభే అయినా ఇది బిజెపికి అతి ముఖ్యమైన జన సమీకరణ సభగా బిజెపి నేతలు చెప్తున్నారు. బహిరంగ సభ సక్సెస్ అయితే ఇటు తుంగతుర్తి ,అటు సూర్యాపేట అధికార టిఆర్‌ఎస్‌పై ప్రభావం పడుతుందని బిజేపి నేతల వ్యూహంగా చెప్తున్నారు. బిజెపి ఆశించిన రీతిలో తుంగతుర్తి బహిరంగ సభ సక్సెస్ అవుతుందా? సంకినేని సాగునీటి విషయంలో విరుతున్న సవాల్‌కు అధికార పక్షం జవాబు చెప్తుందా? వేచి చూడాల్సిందే .

Comments

comments