Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మాటలకే పరిమితమైన కెసిఆర్ పాలన:సంకినేని

Sankineni Speech About KCR Goverment In Suryapet Dist

మనతెలంగాణ/ అర్వపల్లి : కెసిఆర్ పాలన మాటలకే పరిమితమైందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యాక్షులు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు.గురువారం మండల కేంద్రంలోని విలేకర్ల సమావేశంలో మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందుకు సమఖ్య పాలనలో అన్ని రంగాలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నష్ట పోయాలరని తెలంగాణ రాష్ట్రం వస్తే మన బ్రతుకులు బాగుపడాతాయని,నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మననీళ్లు ద్వారా పంటలు పండించుకోవచ్చాని అనుకోని ప్రజలు ఓట్లు వేస్తే కెసిఆర్ పాలన కుటుంబ పాలనగా కోససాగుతుందని వారు అన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న కెసిఆర్ ఎ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలేక పోయారని వారు అన్నారు. తుంగతుర్తి నియోజక వర్గం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అన్ని విధాల అభివృధ్ది చెందిందని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి రాష్ట్రానికి అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వమే పథకాలను ప్రవేశ పెట్టినట్లుగా చేప్పుతున్నారని వారు అన్నారు.సూర్యాపేట నుండి జనగాం జాతీయ రహదారి విస్తరణలో ఇల్లు,దుకాణాలు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోని నష్ట పరిహరం చెల్లించాలని వారు అన్నారు. రేపు జరిగే ప్రజా జన చైతన్య యాత్ర ముగింపు బహిరంగ సభను తుంగతుర్తిలో నిర్వహిస్తున్నట్లు ఈ సభకు ముఖ్య అతిధులుగా కేంద్రమంత్రి ప్రకాశ్ జనదేకర్,బిజేపి జాతీయ కార్యదర్శి మురళిధర్ రావు,కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ,రాష్ట్ర అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ లు హజరవుతున్నట్లు వారు తెలిపారు.కావున బిజేపి నాయకులు,కార్యకర్తలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో బిజేపి మండల అధ్యక్షులు పగిళ్ల శంకర్,బైరబోయిన నాగయ్య,కూర శంకర్,మారపాక రాములు,కీర్తి వెంకటేశ్వర్లు బిజేపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments