Home మెదక్ సంక్రాంతి వరకే గడువు

సంక్రాంతి వరకే గడువు

meeting

– విద్యుత్ సమస్య పరిష్కరించాలి
– మార్చి 31కల్లా భగీరథ నీరందిస్తాం
– సింగూరు నుంచి ఇంటింటికి తాగునీరు
– అధికారుల సమీక్షాసమావేశంలో ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి

మనతెలంగాణ / మెదక్ ప్రతినిధి : సంక్రాంతి వరకు పట్టణంలో విద్యుత్ సమస్య పరిష్కరించి పూర్తి స్థాయిలో 24 గంటల నిరంతర విద్యుత్‌ను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జిల్లా విద్యుత్ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పట్టణంలోని అన్ని వార్డులలో ప్రధానంగా విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని, పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయని అన్నారు. పలువురు వార్డు కౌన్సిలర్లు కూడా విద్యుత్ అధికారుల పనితీరు సరిగా లేకపోవడం, నిర్లక్షంగా వ్యవహరించడం పట్ల వార్డులలో ప్రజలు పదేపదే తమ దృష్టికి తీసుకువస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డతర్వాత ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ను అందిస్తూ లోఓల్టేజ్ సమస్యను రూపుమాపిందని, అయినప్పటికీ జిల్లా కేంద్రంలో సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల విద్యుత్ అధికారులను వివరణ కోరగా అందుకు డిఇ వెంకట్త్న్రం వివరిస్తు… తమ శాఖాకు 3కోట్ల 61లక్షల నిధులు ప్రభుత్వం కేటాయించగా అందులో 46 ట్రాన్స్‌ఫార్మర్లు (100కెవిలు) బిగించడం జరిగిందని, దాదాపు 140 పాత స్తంభాలపై పాడైన విద్యుత్ తీగలను కూడా మార్చడంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు. అనంతరం చైర్మెన్ మల్లికార్జున్‌గౌడ్ మాట్లాడుతూ… గతంలో పలుమార్లు పట్టణంలోని విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ సరైన విధంగా చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజల నుంచి తీవ్రమైన ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీంతో ఉపసభాపతి పట్టణంలోని విద్యుత్ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారాని సంక్రాంతి వరకు గడవు ఇస్తూ ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేవిధంగా అధికారులు తమ విధులను నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ శ్రీనాథ్, డిఇలు వెంకటరత్నం, మల్లేశం, ఎడి సత్యనారాయణ, ఎఇలు రాజేశ్వర్, జ్ఞానేశ్వర్, క్రాంట్రాక్టర్లు, మున్సిపల్ వైస్ చైర్మేన్ రాగి అశోక్, అన్నివార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ కమీషనర్ ప్రసాద్‌రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సింగూరు నుంచి మార్చి 31 వరకు తాగునీరు : నియోజకవర్గంలోని 300 కోట్ల రూపాయల నిధులతో మిషన్‌భగీరథ ద్వారా సింగూరు నుంచి మార్చి 31 వరకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తెలియజేశారు. తన క్యాంపు కార్యాలయంలో ఆర్‌డబ్లుఎస్ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. అనంతరం పత్రికావిలేకరులతో మాట్లాడుతూ…ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి మంచినీరు అందించడమే ద్యేయంగా, తాగునీటి కోసం తెంలగాణ ఆడబిడ్డ ఖాళీ బిందెలతో రోడ్డుపైకి రాకుండా పూర్తిస్థాయిలో ప్రతి ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అందించే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జలయజ్ఞాన్ని చేపట్టారని గుర్తు చేశారు. దీంట్లో భాగంగానే మెదక్ పట్టణానికి 50కోట్ల రూపాయలు కేటాయించి ఏప్రిల్, మే నెలాఖరుకల్లా ఇంటింటికి తాగునీరు అందించే విధంగా ప్రణాళికులు సిద్దం చేసుకోవాలన్నారు. పట్టణంలోని ఖిల్లాపై నిర్మిస్తున్న బ్యాలెన్స్ రిజర్వయర్ (ఓహెచ్‌ఎస్‌ఆర్) ద్వారా పైపులైన్లతో నీటిని అందించేందుకు పనులు జరుగుతున్నాయని, నూతనంగా నిర్మించే 187 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లలో ఇంకా 20 నిర్మాణం కాలేదని, వాటిని కూడా త్వరలోనే పూర్తి చేసి అనుకున్న సమయానికల్లా నీటిని అందించేందుకు పనులు వేగవంతం చేస్తామన్నారు. ప్రతి ఓహెచ్‌ఎస్‌ఆర్‌కు పైపులైన్ల పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూంలకు కూడా మిషన్‌భగీరథ ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్లుఎస్ అధికారులు, మున్సిపల్ చైర్మేన్ మల్లికార్జున్‌గౌడ్ పాల్గొన్నారు.