Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిం

Santoshraj, Neha Deshpande Act in anuvamshikatha

కౌండిన్య మూవీస్ పతాకంపై నటుడు, నిర్మాత తాళ్లపల్లి దామోదర్‌గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘అనువంశికత’. సంతోష్‌రాజ్, నేహా దేశ్‌పాండే జంటగా నటిస్తున్నారు. రమేష్ ముక్కెర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ సి.మధుసూదనాచారి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ బావుంది. చిత్ర దర్శక నిర్మాతలు మా గ్రామస్తులే. సినిమా తీయడమే సాహసం. అలాంటిది సమాజానికి సందేశం అందించే సినిమా తీయడమనేది మామూలు విషయం కాదు. ఇంతవరకు ఎవరూ టచ్ చేయని అంశంతో సినిమా చేస్తున్న దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను”అని అన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో గొప్ప సందేశంతో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉన్నాయి. ఇందులో నేను మంచి పాత్ర చేశాను. దర్శకుడు రమేష్ దీనికి మ్యూజిక్ కూడా అందించారు. పాటలు అద్భుతంగా ఉన్నాయి”అని తెలిపారు. దర్శకుడు రమేష్ ముక్కెర మాట్లాడుతూ “మేనరికపు సంబంధాలు చేసుకుంటే జరిగే అనర్థాలను మా సినిమా ద్వారా చూపిస్తున్నాం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 24న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం”అని పేర్కొన్నారు. హీరోయిన్ నేహా దేశ్‌పాండే మాట్లాడుతూ “ఇదొక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిం. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్ కందుకూరి, తాళ్లపల్లి దామోదర్ గౌడ్, సాయి వెంకట్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Comments

comments