Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

తక్కువ కేలరీలు ఎక్కువ ప్రయోజనాలు

sapota

సపోటా పండు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎక్కువ కేలరీలుండే సపోటా పండుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దాదాపుగా ఏ పండులోనూ దొరకని తియ్యనైన రుచి మనకు సపోటా పండ్లలో లభిస్తుంది. ముఖ్యంగా ఈ పండ్లు మనకు ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతాయి. కనుక వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి తేలిగ్గా జీర్ణమవడమే కాదు, శరీరానికి శక్తిని అందిస్తాయి. యాక్టివ్‌గా ఉంచుతాయి.
* సపోటా పండ్లలో మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు సంపూర్ణ పోషణను అందిస్తాయి. శరీరానికి శక్తినిచ్చి చురుగ్గా ఉంచుతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
* సపోటా పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ’సి’ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సపోటాల్లో పీచు పదార్థం ఉండటంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ప్రోటీన్లు, ఐరన్ శక్తి అధికంగా ఉండే ఈ పండ్లను తీసుకోవడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోజ్ ని సమృద్ధిగా కలిగి ఉంటుంది.
* ఎముకల పటుత్వాన్ని పెంచడానికి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అధిక మొత్తంలో అవసరం. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ సపోటాల్లో అధికంగా ఉండడం వల్ల, సపోటా పండ్లు ఎముకల దృఢత్వానికి బాగా సహాయపడుతాయి.
* పిండిపదార్ధాలు, అవసరమైన పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండడం వల్ల గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం. ఇవి నీరసాన్ని, గర్భం సమయంలో వచ్చే వికారం, మైకం వంటి ఇతర లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి.
* సపోటా పండు అనేక యాంటీ-వైరల్, యాంటీ-పరాసిటిక్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. బాక్టీరియా మనవ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. సపోటా పండు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అందువల్ల నిద్రలేమి, ఆందోళన, వ్యాకులతతో బాధపడుతున్నవారికి మంచిది.
* సపోటాలు మూత్రపిండాల్లో, పిత్తాశయంలో రాళ్ళను తొలగించడానికి సహాయపడి, మూత్రవిసర్జన కారకాలుగా పనిచేస్తాయి. అలాగే ఇవి మూత్రపిండాల వ్యాధుల నుండి రక్షణను అందిస్తాయి. సపోటా పండు బరువు తగ్గడంలో పరోక్షంగా సహాయపడుతుంది.
* సపోటాలో విటమిన్-ఎ అధికపాళ్లలో ఉంటుంది. ఇది కళ్లకు ఎంతో మంచిది. నడివయస్కులు తరచూ సపోట పళ్లు తినడం వల్ల కంటి రుగ్మతలకు గురికాకుండా ఉండవచ్చు. అధికశాతం కార్బోహైడ్రేట్స్ సపోటాలో కాల్షియం, పాస్ఫరస్, ఐరన్‌లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎముకల గట్టిదనానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

Comments

comments