Home సినిమా నేను మెగా అభిమానిని

నేను మెగా అభిమానిని

llb

సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి. పతాకంపై సప్తగిరి హీరోగా చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను రామ్‌చరణ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి, చరణ్ లక్కాకుల, డా.రవికిరణ్, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ “సప్తగిరి అంటే నాకు చాలా ఇష్టం. అతను మెచ్యూర్డ్ కమేడియన్. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. పాటలు కూడా చూశాను. చాలా బాగున్నాయి. తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది”అని అన్నారు. సప్తగిరి మాట్లాడుతూ “నేను మెగా అభిమానిగా పుట్టడం నా అదృష్టం. ఒక మెగా అభిమాని హీరోగా ఎదగడం కోసం పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్, సాయిధరమ్‌తేజ్ అందిస్తున్న సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మెగా అభిమానులందరూ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది”అని తెలిపారు. నిర్మాత డా.రవికిరణ్ మాట్లాడుతూ “ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ మా ట్రైలర్ లాంచ్ చేసిన రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు. సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం మాకుంది”అని పేర్కొన్నారు. దర్శకుడు చరణ్ లక్కాకుల మాట్లాడుతూ “రామ్‌చరణ్ ‘రచ్చ’ సినిమాకు నేను కో డైరెక్టర్‌గా పనిచేశాను. ఆయనతో సంవత్సరం పాటు ప్రయాణించాను. ఇప్పుడు రామ్‌చరణ్ మా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయడంతో ఎంతో హ్యాపీగా ఉంది” అన్నారు.