Search
Friday 16 November 2018
  • :
  • :

ఏజెన్సీ నయగారాకు సందర్శకుల తాకిడి

కనువిందుచేస్తున్న సప్తగుండాల జలపాతం
సౌకర్యాలు లేక పర్యాటకుల వెతలు

           Water-fall-3

లింగాపూర్ : కుమ్రం భీంజిల్లాలోని లింగాపూర్ మండల కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరంలో చేరువలో ఉన్న సప్తగుండాల జలపాతం కనువిందు చేస్తోంది. అత్యంత లోయలో ఉన్న జలపాతం ఏజెన్సీ నయగారాగా పేరుగాంచింది. మిత్తే జలపాతంగా ఇక్కడి ప్రాంతంలో ప్రాచూర్యం పొందిన జలపాతాన్ని చూసేందుకు ఉమ్మడి జిల్లాల పర్యాటకులతో పాటు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నుంచి కూడా పర్యాటకుల తాకిడి పెరగగా సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యానికి గురైన ఈ పర్యాటక ప్రాంతం స్వరాష్ట్రంలో కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో దూర ప్రాంతాలనుంచి వచ్చిన పర్యాటకులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఐఏఎస్ అధికారులు కూడా తరుచుగా ఈ పర్యాటక ప్రాంతాన్ని సందర్శిస్తున్నప్పటికీ కనీసం రహదారి సౌకర్యం లేక కొట్టుమిట్టాడుతున్నారు. సప్తరార్ణలతో ఏడు గుండాలు ఉన్న ఈ జలపాతం లింగాపూర్ మండలం నుంచి తిర్యాణి మండలం వరకు నెలకొని ఉంది. రాముని గుండం, సప్తగుం డాలు, మిత్తే జలపాతంగా పిలువబడే ఈ జలపాతం ప్రస్తుత వర్షాకాలంలో ఎత్తైన ప్రాంతం నుంచి పాలనురగా లాంటి పారే సెలయేరును చూసేందుకు పర్యాటకులు తన్మయత్వం పొందేందుకు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ఈ జలపాతం కళకళలాడు తోంది.

            Waterfall

ఒక జలపాతం నయగార జలపాతం లాగా కనువిందు చేయగా మిగతా ఆరు గుండాలు సుమారు 50 అడుగుల నుంచి నీరు కిందికి దూకుతుంటే ఆ దృశ్యాన్ని తిల కించిన సందర్శకుల ఆనందాలకు అవదు లుండవు. ప్రస్తుతం పై నుంచి పెద్ద ఎత్తున నీరు కిందికి దూకుతుండడంతో జలపాతం సందర్శకులను కనువిందు చేస్తోంది. ప్రతి ఆదివారం పర్యాటకుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఈ జలపాతానికి చెరుకోవాలంటే జైనూర్ నుంచి సిర్పూర్(యు) మీదుగా లింగాపూర్ చేరుకుంటే అక్కడి నుంచి  మూడు కిలో మీటర్ల నడక ప్రయాణంతో ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు.

Comments

comments