Home గాసిప్స్ హృతిక్ సరసన సారా ?

హృతిక్ సరసన సారా ?

SARA

ముంబయి : సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ సినీరంగ ప్రవేశంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆమె ఎంట్రీపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ సరసన సారా నటించబోతుందన్న గుసగుసలు బీటౌన్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. కరణ్ జోహార్ చేతుల మీదుగా సారా సినీ తెరంగేట్రం చేయనుందని కొంతకాలం క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అది ఏ సినిమా, ఎప్పుడు తెరకెక్కిస్తారన్నది మాత్రం తెలియరాలేదు. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కూడా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో ఇషాన్, సారా ఒకే చిత్రంతో తెరంగేట్రం చేస్తారన్న గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే కరణ్ నిర్మాణ సారథ్యంలో హృతిక్ సరసన నటించేందుకు సారాకు అవకాశం దక్కిందని బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో హృతిక్ అగ్నిపత్ చిత్రంలో నటించారు. ఇప్పుడు ఓ కామెడీ చిత్రాన్ని తీయాలని ఆయన అనుకుంటున్నారట. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ చిత్రానికిసారా అలీఖాన్‌ను ఎంపికచేసినట్లు తెలిసింది.