Search
Thursday 15 November 2018
  • :
  • :

నైట్ షూటింగ్‌లో సర్దార్

Pawan-Kalyanచాలా రోజు క్రితం ప్రారంభమైన ‘సర్దార్’ మూవీ షూటింగ్‌లో పవన్‌కల్యాణ్ ఇటీవలే పాల్గొంటున్నాడు. దాదాపు 8 నెలల గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. సినిమా షూటింగ్ చకచకా ఫినిష్ చేసే పనిలో ఆయన ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూళ్లు పూర్తిచేసుకుంది. జూలై 28న ప్రారంభమైన సెకండ్ షెడ్యూల్‌ను ఆగస్టు 6 వరకు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేశారు. ఈ షెడ్యూల్‌లో పవన్‌పై వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు విలన్‌లకు దమ్కీ ఇచ్చే కొన్ని సీన్లను షూట్ చేశారు. మూడవ షెడ్యూల్ తాజాగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది. సినిమా కోసం ప్రత్యేకంగా ఆర్‌ఎఫ్‌సిలో ఓ స్పెషల్ సెట్‌ని సిద్ధం చేశారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా నైట్ సీన్లను చిత్రీకరిస్తున్నారు.

సినిమాలో హైలైట్‌గా ఉండేవిధంగా ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత వచ్చే నెల గుజరాత్‌లో తదుపరి షెడ్యూల్ జరుగుతుంది. మేజర్ ఎపిసోడ్స్‌ను అక్కడ షూట్ చేస్తారు. హాట్‌బ్యూటీ కాజల్ అగర్వాల్… పవన్‌కళ్యాణ్‌కు జంటగా ఎంపికకాగా మరో హీరో కోసం అన్వేషిస్తున్నారు. పవన్‌కు పోటీనిచ్చే విలన్‌గా మరాఠీ నటుడు శరత్ కేల్కర్ నటిస్తున్నాడు. మ్యూజిక్‌ను అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్‌ను కంపోజ్ చేశాడు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేసేందుకు ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేశారు. పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామాగా సినిమా రూపుదిద్దుకుంటోంది. పవన్ కెరీర్‌లోనే ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుందని ఫిల్మ్‌మేకర్స్ అంటున్నారు.

Comments

comments