Home మంచిర్యాల మైనార్టీ సంక్షేమానికి సర్కార్ పెద్ద పీట

మైనార్టీ సంక్షేమానికి సర్కార్ పెద్ద పీట

Sarkar is a big plate for minority welfare,
జన్నారం: తెలంగాణ రాష్ట్రంలోని పేద మైనార్టీ ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట వేస్తున్నారని ఖానాపూర్ ఎంఎల్‌ఎ రేఖ శ్యాం నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎంపిపి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు పేద ముస్లీం కుటుంబాలకు ఎంఎల్‌ఏ రేఖ శ్యాం నాయక్ బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధిముబారక్, మసీద్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు మైనార్టీలను పట్టించుకున్న పాపన పోలేదన్నారు. పేదల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని, ఇలాంటి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శెట్‌పల్లి రాజేశ్వరి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు గుర్రం రాజరాంరెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు ముత్యం సతీష్, భరత్‌కుమార్, ముత్యం రాజన్న, రాగుల శంకర్, తదితరులు పాల్గొన్నారు.