Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘సర్కార్’ రాజీ..!

Sarkar Controversy
చెన్నై: దీపావళి కానుకగా తమిళ దళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘సర్కార్’ సినిమా నవంబర్ 6న విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చిన… మరోవైపు వివాదాలు చుట్టుముట్టాయి. అయితే తాజాగా ఈ వివాదంపై సర్కార్ చిత్ర యూనిట్ తమిళ సర్కార్ తో రాజీకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేందుకు చిత్ర నిర్మాతలు అంగీకరించారని తెలిసింది. మూవీలో రాజకీయాలపై అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ అన్నాడిఎంకె నేతలు సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్ల వద్ద నిరసనకు దిగడంతో ఈ వ్యవహారం కాస్తా ముదిరిన సంగతి తెలిసిందే.
దీంతో చిత్ర దర్శకనిర్మాతలు మెట్టు దిగొచ్చారు. ముఖ్యంగా దివంగత సిఎం జయలలితకు సంబంధించిన సన్నివేశంలో బీప్ శబ్దంతో మ్యూట్ చేస్తామని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎడిట్ చేసిన వెర్షన్‌ని శుక్రవారం మ్యాట్నీషో నుంచే థియేటర్స్‌లో ప్రదర్శించున్నట్లు థియేటర్ యాజమాన్య సంఘం ప్రకటించింది. చివరకు అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేందుకు సర్కార్ యూనిట్ ఒప్పుకోవటంతో ఈ వివాదం రాజీకొచ్చింది. ప్రముఖ దర్శకుడు ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కార్’ ఓ వైపు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే మరోవైపు వివాదాల సుడిగుండంలో చిక్కుకుకోవడం శోచనీయం. ఇదిలా ఉంటే ‘సర్కార్’ వివాదంపై స్పందించిన సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌లు… రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనలను తప్పుబట్టిన సంగతి తెలిసిందే.
Sarkar makers agreed to remove the controversial scenes

Telangana Breaking News

Comments

comments