Search
Monday 24 September 2018
  • :
  • :

సామాన్యుని ముంగిట్లోకి సర్కార్ పాలన

  • చిన్నా జిల్లాల ఏర్పాటు ఉద్దేశం అదే
  • నిర్మల్ జిల్లాను ఆగ్రస్థానంలో నిలిపేందుకు అందరు సహకరించండి
  • రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

Indrakaran-Reddyనిర్మల్: సామాన్య ప్రజలకు సర్కారు పాలనను మరింత చేరువ చేసి అభివృద్ధి, సంక్షేమ పథ కాలన్ని వారికి దక్కలన్న సదాశయంతోనే కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చూట్టిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. మంగళ వారం స్థానిక ఎన్టీఆర్ మీనిస్టేడియంలో నిర్మల్ జిల్లా ఆవిర్భావ వేడుకలను మంత్రి ప్రారంభించి ప్రసంగిం చారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలన పారదర్శంగా ఉండడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పర్యవేక్షణ పెరుగుతుందన్నారు. అధికారుల నిరంతర పర్వవేక్షణతో పేదలందరికి న్యాయం జరుగుతుందన్నా రు. అదికారులు ఉద్యోగులపై పని ఒత్తిడి భారం తగ్గు తుందని తెలిపారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి, సంక్షే పథకాలన్ని విజయవంతం కావలంటే అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషి అవస రామన్నారు. నిర్మల్ జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగన నిలిపేందుకు అందరూ సహాకారించాలని కోరారు. నిర్మ ల్ అభివృద్ధికి కోట్లలాది రూపాయలతో ప్రణాళికలు సి ద్దం చేశామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమా లకు ప్రజల సహాకారం మరింత అవసరమన్నారు. మొ దటి నుంచి ప్రభుత్వం ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఉందన్నారు. పనిచేసే అధికారులు, ఉద్యోగులకు గు ర్తింపునిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యత యుతంగా వ్యవహారించాలని సూచించారు. ముఖ్య మంత్రి కేసీఆర్ కృషి మేరకు నిర్మల్ జిల్లా ఏర్పాటైందన్నారు. ఇక్కడి ప్రజ ల ఆశాలు, ఆకాంక్షలను గుర్తించిన ముఖ్య మంత్రికి మంత్రి ఐకే రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో నిర్మల్‌ను బంగారు నిర్మల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కొత్తగా ఏర్పాటైన కుమ్రం భీం, మంచిర్యాల జిల్లాల మధ్య పరస్పర సహా కారం పెంపోందాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలందరికి అందిననాడే పేదరికం తగ్గుతుందన్నారు. విద్యాభివృద్ధి ఎంతో అవసరమని పేర్కోన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇల్లంబర్తి, ఎస్పీ విష్ణు సీ వారియర్ ఆదిలాబాద్ ఎంపి నగేష్, జడ్పీ చైర్‌సర్సన్ శోభ సత్యనారాయణ గౌడ్, ఖానాపూర్ ఎమ్మె ల్యే రేఖా శ్యాం నాయక్, మున్సిపాల్ చైర్మన్ అప్పాల గణేష్, ఎంపిపి సుమతి గోవర్ధన్ రెడ్డి, పలువురు ఎంపిటి సిలు, జడ్పిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Comments

comments