Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

దళితునిపై దాడి చేసిన సర్పంచ్

Dalit

మనతెలంగాణ/కాల్వశ్రీరాంపూర్: గ్రామప్రజల బాగోగులు చూడాల్సిన సర్పం చ్ తన కుటుంబ సభ్యులతో కలిసి, ఓ దళితునిపై దాడి చేసి, విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చిన సంఘటన కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్ఠంపేట గ్రామంలో జరిగింది. బాదితుడు తలకోటి సురేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బాధితుని కుటుంబానికి చెందిన గుంటన్నర ఇంటి స్థలాన్ని గ్రామపంచాయతీ భవన రిర్మాణానికి తీసుకున్నారు. ఇందుకు నష్ఠపరిహారం గానీ, మరోచోట స్థ లంగానీ ఇవ్వలేదు. ఈ విషయంలో బాధితుడు సురేష్, సర్పంచ్ భర్త పల్లేర్ల తిరు పతి మధ్య ఈ నెల 1న గొడవ జరిగి పోలీసుల వద్దకు వెళ్లింది. పోలీసులు ఇరు వురికి కౌన్సిలింగ్ నిర్వహించారు.

దీనితో కక్షకట్టిన సర్పంచ్ పల్లేర్ల వనిత, అమె భర్త తిరుపతి, మరిది రవి ఈ నెల 7న రాత్రి 7.00గం॥ల సమయంలో గ్రామం లోని ఓ కిరాణా షాపుకు వెళ్లి వస్తున్న సురేష్‌పై దాడి చేసి చితక బాదారు. శ్రీరా ంపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై దాడి చేశారని స ర్పంచ్ కుటుంబంపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని. పైగా తననే బెదిరించి తెల్లకాగితంపై సంతకం తీసుకున్నట్లు బాధితుడు సురేష్ ఆరోపించారు. సుల్తానాబాద్ సిఐ తుల శ్రీనివా సరావు వద్దకు వెళ్లి, తనగోడు వెళ్లబోసుకోగా సిఐ ఆదేశించిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారని బాధితుడు తన ఆవేదన వ్యక్తంచేశాడు. సురేష్ ఫిర్యాదు మేరకు సర్పంచ్ పల్లేర్ల వనిత, అమె భర్త తిరుపతి, మరిది రవిపై అలాగే తమ ఇంటికి వచ్చి తలుపులు తన్నుతూ, బూ తుమాటలు తిట్టినట్లు సర్పంచ్ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు తలకోటి సురేష్‌పై కేసులునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments