Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

మేం సర్పంచ్‌లం కాదా?

                   Sarpanch

నర్సాపూర్ : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతున్న, గ్రామ సర్పంచ్‌లకు కనీస సమాచారం ఉండటం లేదని, మం డల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్‌లు మద్దూర్ శంకరయ్య, నత్నాయిపల్లి పర మేశ్వరరాజు, ఎంపిటిసిలు మండి పడ్డారు. గురువారం మండల అభివృద్ధి అధికార సమావేశ మందిరంలో, ఎంపిడిఓ శ్రావన్‌కుమార్ అధ్యక్షతన మండల స్థాయి సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందినా ప్ర జా ప్రతినిధులు తమ గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో సర్పంచ్‌లకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని, ఇలాగైతే తాము సర్పంచ్‌లు గా ఉండటం ఎందుకన్నారు.

గ్రామాలలో మిషన్ కాకతీయ పనులు జరుగుతుంటే, ఇప్పటికి సర్పంచ్‌లకు సమాచారం లేదని, అలాంటప్పుడు తమను సమావేశాలకు పిలవడం ఎందుకు అంటు నిలధీశారు. ఈ వియంలో ఎంపిడిఓ శ్రావన్ కుమార్ కల్పించుకుని ఇక నుంచి అలాంటి తప్పులు జరుగవని ప్రతి శాఖల అధికారులు మీ గ్రామాలలో పనులు చేపట్టవలసినవి ఉంటే తప్పకుండ సర్పంచ్‌లకు సమాచారం ఇవ్వాలని తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఇప్పటి వరకు చేపట్టిన పనులను, ఇక ముందు చేపట్టబోయే పనుల వివరాలను సమావేశంలో తెలియజేశారు.

కలసికట్టుగా నర్సాపూర్ ను అభివృద్ధి పథంలో నిలబెడదాం : ప్రతి ఒక్కరం కలసి కట్టుగా ఉండి నర్సాపూర్ పట్టణాని అభివృద్ధి పథంలో నిలబెడదామని జెడ్‌పి చైర్ పర్సన్ రాజమణి అన్నారు. పార్టీల కథితంగా అందరం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టి మరిన్ని నిధులను మంజూరి చేయించుకుని ఎవరికి వారుగా అభివృద్ధిలో ముందుకు సాగాలన్నారు. ఇప్పటికే మూడు సంవత్సరాల కాలం గడిచిందని, ఉన్న సమయంలో అభివృద్ధి పనుల కోసం పాటు పడుతూ ముందుకు సాగాలని వారు సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శ్రీనివాస్ గౌడ్, వైస్‌ఎంపిపి శ్రీనివాస్‌గుప్తా, తహసీల్దార్ అమినోధ్దిన్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు.

Comments

comments