Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అజ్ఞాత ప్రాంతానికి అన్నాడిఎంకె ఎంఎల్‌ఎలు

AIADMK-MLAs

చెన్నై: అన్నాడిఎంకెలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఎంఎల్‌ఎల మద్ధతు తమకే ఉందని అటు శశికళ, ఇటు పన్నీర్ సెల్వం ప్రకటించుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ఎంఎల్‌ఎల బల ప్రదర్శన రెండు వర్గాలకు ప్రధానంగా మారింది. దీంతో అన్నాడిఎంకెలో క్యాంపు రాజకీయాలకు తెరలేపుతూ బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో శశికళ వర్గం పార్టీ ఎంఎల్‌ఎలను ఓ బస్సులో రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. మరోవైపు పన్నీరు సెల్వం గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసేందుకు ముంబయి పయనమవుతున్నట్లు తెలుస్తోంది. సిఎం పగ్గాల కోసం శశికళ వర్గం, పన్నీరు సెల్వం వర్గం వ్యూహ ప్రతివ్యూహాలలో తలమునకలై ఉన్నారు.

Comments

comments