Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

జయలలిత వద్దన్న.. నేనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాను..

Jaya-lalitha-and-Shashikala

చెన్నైః జయలలిత మరణంపై శశికళ ఎట్టకేలకు స్పందించారు. ఆమె మృతిపై విచారణ జరుపుతున్న కమిషన్‌కు కీలక  సమాచారన్నిఅందించారు. జయలలిత మరణంపై విచారణ జరపడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ముగస్వామి కమిషన్‌ను నియమించిన విషయం విధితమే. ప్రస్తుతం శశికళ భర్త చనిపోవడంతో జైలు నుంచి పెరోల్ మీద బయటకు వచ్చిన ఆమె కమిషన్ ముందు హాజరయ్యారు. జయలలితను ఆరోజు నివాసం నుంచి వైద్యాశాలకు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందన్న విషయాలను శశికళ తెలియాజేశారు. ఆ రోజు తెల్లవారు జామున పళ్లు తొమిన అనంతరం బాత్‌రూమ్‌లోనే తనకు ఏదో సమస్యగా అనిపిస్తున్నదని జయలలిత చెప్పారు. దాంతో ఆమెను తానే తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టినట్టు తెలిపింది. ఆ సందర్భంలోనే జయలలిత స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అపోలో వైద్యులను ఇంటికి పిలిపించి, స్ట్రెచర్‌పై ఆమెను అలాగే అంబులెన్స్‌లోకి తీసుకెళ్లామన్నారు. మార్గం మద్యలోనే ఆమెకు సృహా రాగానే ఎక్కడికి వెళ్తున్నాం అని ప్రశ్నించడంతో దవాఖానకు అని తెలిపాను. ఆమె వద్దని వారించినా… ఆసుపత్రికి వెళ్తేనే మంచిదని చెప్పి ఆమెను తీసుకెళ్లానని శశికళ కమిషన్‌కు వెల్లడించారు.

2014 సెప్టెంబర్‌లో అక్రమాస్తుల కేసులో నింధితురాలని ముద్ర పడినప్పటి నుంచి జయలలిత ఆనారోగ్యంతో మంచం పట్టినట్లు శశికళ చెప్పింది. 2014 నవంబర్ నుంచి సెప్టెంబర్ 2016 మధ్య కాలంలో జయలలితకు వైద్యం అందించిన  20 మంది డాక్టర్ల వివరాలను ఆమె కమిషన్‌ ముందు సమర్పించింది. ప్రస్తుతం వీళ్లంతా చెన్నై, ముంబయి, కోల్‌కతాల్లోని వివిధ హాస్పిటల్స్ లో విధులు నిర్వహిస్తున్నరని తెలియాజేశారు. ఇదిలా ఉండగా.. ఆసుపత్రిలో జయమ్మకి ఎవరినీ కలవనీయలేదన్న ఆరోపణలపై శశికళ స్పందిస్తూ.. ఆ సందర్భంలో గవర్నర్ విద్యాసాగర్‌రావు, అన్నాడిఎంకె నేతలు పన్నీరుసెల్వం, తంబిదురై, విజయ్ భాస్కర్ ఆమెను కలిసి మాట్లాడరని శశికళ తెలిపింది. గతంలో పన్నీరుసెల్వం, తంబిదురై అయితే జయలలితను కలవడానికి తమకు అంగీకరించలేదని ఆరోపించిన విషయం తెలిసిందే. 2016, డిసెంబర్ 5న జయలలిత చెన్నైలోని అపోలో దవాఖానలో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే.

Comments

comments