Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

నన్ను సిఎం పదవి చేపట్టాలని ఆయనే ఒత్తిడి తెచ్చారు

Sasikal-and-Selvam

చెన్నై: చిన్నమ్మ శశికళ నటరాజన్ కొద్దిసేపటి క్రితమే అన్నా డిఎంకె శాసనసభాపక్షనేతగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం పన్నీర్ సెల్వం సిఎం పదవికి రాజీనామా చేశారు. శశికళకు తన రాజీనామా లేఖను కూడా అందించారు. దీంతో రాబోయే రెండు మూడు రోజుల్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా చిన్నమ్మ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శశికళ మాట్లాడారు. తనను సిఎం పదవి చేపట్టాలని పన్నీర్ సెల్వమే ఒత్తిడి తెచ్చారని చెప్పారు.

అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలని మొదట కోరింది కూడా ఆయనేనని చెప్పుకొచ్చారు. అందుకు పన్నీరుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక పాలనలో అమ్మ జయలలిత మార్గంలోనే నడుస్తానని చిన్నమ్మ చెప్పారు. ఆమె ఆశయాలు నెరవేరేలా తన కార్యచరణ ఉండనుందన్నారు. ఇదిలాఉండగా డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్షనేత స్టాలిన్ మాత్రం శశికళ ముఖ్యమంత్రి కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శశికళను తమిళ ప్రజలు సిఎంగా అంగీకరించరని, ప్రజలు ఓట్లేసింది అమ్మకే కాని ఆవిడ కుటుంబానికి కాదని స్టాలిన్ విమర్శలు గుప్పించారు. స్టాలిన్‌తో పాటు జయలలిత మేన కోడలు దీప కూడా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

Comments

comments