Home తాజా వార్తలు రేపే శశికళ ప్రమాణస్వీకారం!

రేపే శశికళ ప్రమాణస్వీకారం!

Sasikala-Natarajanచెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదివారం సమావేశమైన తమిళనాడు శాసనసభా పక్షం శశికళను శాసనసభాఫక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆయన పదవి రాజీనామా చేస్తూ ఆ లేఖను రాష్ట్ర ఇంచార్జీ గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావుకు సమర్పించారు. పన్నీర్ సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో తదుపరి ముఖ్యమంత్రిగా శశికళను ఎన్నుకున్నారు. శశికళ మంగళవారం ఉదయం 8.45 గంటలకు చెన్నై సెంటినరీ ఆడిటోరియంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తమిళనాడు రాష్ట్రానికి శశికళ మూడో మహిళ ముఖ్యమంత్రి కావడం విశేషం.