Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

డిఆర్‌డిఒ చైర్మన్‌గా సతీశ్‌రెడ్డి 

Satheesh Reddy appointed as new DRDO chairman

న్యూఢిల్లీ : ప్రముఖ శాస్త్రవేత్త జి సతీశ్ రెడ్డి రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) ఛైర్మన్‌గా నియమితులు అయ్యారు. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుడిగా ఉన్న సతీశ్ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు శనివారం వెలువడిన అధికారిక ఉత్తర్వులలో తెలిపారు. డిఆర్‌డిఒ అధినేతగా సతీశ్‌రెడ్డి పదవీకాలం ఇప్పటి నుంచి రెండేళ్ల వరకూ ఉంటుంది. ఇదే సమయంలో ఆయన రక్షణ పరిశోధనా, అభివృద్ధి విభాగం కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారని అధికార ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మే నెలలో అప్పటివరకూ డిఆర్‌డిఒ చీఫ్‌గా ఉన్న ఎస్ క్రిస్టోఫర్ పదవీకాల పరిమితి ముగిసింది. అప్పటినుంచి ఈ స్థానం భర్తీ కాకుండా ఉంది. డిఫెన్స్ సెక్రటరీగా ఉన్న సంజయ్ మిత్రా అదనపు బాధ్యతగా దీనిని నిర్వహిస్తూ వస్తున్నారు. భారత రక్షణ వ్యవహారాలకు సంబంధించి డిఆర్‌డిఒ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఛైర్మన్‌గా నియమితులు అయిన సతీశ్ రెడ్డి ఇంతకు ముందు డిఆర్‌డిఒలోని పరిశోధనా కేంద్రం ఇమారత్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. పారికర్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారుడిగా నియమితులు అయ్యా రు. 1963 జూలైలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని మహిమలూరు గ్రామంలో సతీశ్ రెడ్డి జన్మించారు. అనంతపురంలో బిటెక్, జెఎన్‌టియూ హెచ్‌లో ఎంఎస్ పూర్తి చేసిన సతీశ్ రెడ్డి 1985లో డిఆర్‌డిఒలో చేరారు. నావిగేషన్, ఏవియానిక్స్ టెక్నాలజీ రంగాలలో విశేష పరిశోధనల అనుభవం ఉంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నుంచి హోమీ జహంగీర్ బాబా స్మారక అవా ర్డు, స్వావలంభన పరిశోధనకు ప్రధాని నుంచి పురస్కారం, ఇతరత్రా గౌరవాలు పొందారు. 1980లో రక్షణ పరిశోధనా అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేశారు. దేశ త్రివిధ సైనిక బలగాలకు ఎప్పటికప్పుడు అవసరం అయిన వ్యూహాత్మక సైనిక పరికరాలు, యుద్ధ ప్రక్రియలకు అవసరమైన పరిశోధనల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఈ విభాగం సూచనలు వెలువరిస్తుంది.

Comments

comments