Home అంతర్జాతీయ వార్తలు యెమెన్‌లో సౌదీ వైమానిక దాడులు

యెమెన్‌లో సౌదీ వైమానిక దాడులు

Saudi-air-strikes

యెమెన్ : యెమెన్ రాజధాని సానా సమీపంలో సౌదీ సంకీర్ణ దళాలు వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో 41 మంది చనిపోయారు. ఈ దాడుల్లో గాయపడిన మరో 15మందిని ఆస్పత్రికి తరలించారు. సానా శివారు ప్రాంతంలో అర్హ పట్టణంలో ఉన్న ఓ హోటల్‌పై ఈ దాడులు జరిగాయి. హోటల్ నుంచి మృతదేహాలను వెలికి తీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హౌతి రెబల్స్ ఉన్నారన్న సమాచారంతో ఈ దాడులు జరిపినట్టు అధికారులు తెలిపారు. 2015 నుంచి సానా నగరం రెబల్స్ ఆధీనంలో ఉన్న విషయం తెలిసిందే.

Saudi air strikes in Yemen