Home అంతర్జాతీయ వార్తలు సౌదీపై ఐసిస్ గురి

సౌదీపై ఐసిస్ గురి

ISISసిరియా: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్)  ఉగ్రవాద సంస్థ గురిపెట్టిన దేశాల జాబితా నానాటికీ పెరిగిపోతోంది. కొత్తగా ఇప్పడు సంపన్న అరబ్ దేశం సౌదీ అరేబియా కూడా దీనిలోకి చేరిపోయింది. ఇటీవల సౌదీ దౌత్యంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 34 ఇస్లామిక్ దేశాలతో సంకీర్ణసేన రూపొందింది. దీనికి ప్రతికారంగానే గురువారం ఐఎస్ ఒక విడియో విడుదల చేసింది. క్రూసేడర్లతో సౌదీ జతకట్టిందని ఈ విడియోలో నిందించింది. వీడి యో చివర్లో ఒక నీలం రంగు దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తిని సౌదీ అరేబియాకు సహకారిగా నింది స్తూ అతని తలకు తుపాకీ గురిపెట్టినట్లు చూపించారు.