Search
Sunday 18 November 2018
  • :
  • :

48గంటల్లో దేశం విడిచి వెళ్లిపోండి : సౌదీ అరేబియా

Saudiరియాద్: ఇరాన్ పట్ల  సౌదీ అరేబియా కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకుంది. 48 గంటల్లోగా తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఇరాన్ దౌత్యవేత్తలను ఆదేశించింది. ఇరాన్ లోని తమ దౌత్య కార్యాలయంపై దాడి జరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సౌదీలో షియా వర్గీయుల మతపెద్ద నిమ్ అల్ నిమ్‌న్రు ఉరి తీయడంతో ఇరాన్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. సౌదీ దౌత్య కార్యాలయంపై ఆదివారం పెట్రోల్ బాంబులు, రాళ్లతో ఆందోళనకారులు దాడికి దిగారు. ఈ దాడి గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి సౌదీ విదేశాంగ మంత్రి ఆదెల్ ఆల్-జుబేర్ తెలిపారు. ఈ దాడి నుంచి బయటపడ్డ తమ దౌత్యవేత్తలు సురక్షితంగా దుబాయ్ చేరుకున్నారని వెల్లడించారు. తమ దౌత్య కార్యాలయంపై దాడిని అడ్డుకునేందుకు ఇరాన్ ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. ఆయుధాలు సరఫరా చేస్తూ అల్‌ఖాయిదాకు ఇరాన్ అండగా నిలుస్తోందని అన్నారు. మరోవైపు సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికిగాను మధ్యవర్తిత్వం నెరపడానికి రష్యా సంసిద్ధతను సోమవారం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని రష్యా వార్తా సంస్థ టాస్ పేర్కొంది. సౌదీ అరేబియా, ఇరాన్‌తో దౌత్య సంబంధాలు తెంచుకున్న నేపథ్యంలో రష్యా ఈ ప్రస్తావన తెచ్చింది.

Comments

comments