Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సౌదీ ఫుట్ బాల్ జట్టు విమానంలో మంటలు

Saudi Arabia World Cup 2018 team plane catches fire mid-flight

మాస్కో: రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా సౌదీ అరేబియా ఫుట్ బాల్ ప్లేయర్లు ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. విమానం గాల్లో ఉండగానే మంటలు వ్యాపించాయి. దీంతో, ఆటగాళ్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కానీ, చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక లోపం వల్లే ఇంజిన్ లో మంటలు వచ్చాయని తెలుస్తోంది. అయితే పక్షి ఢీకొనడం వల్ల మంటలు చెలరేగాయని రష్యా ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. ఉరుగ్వేతో మ్యాచ్ ఆడేందుకు రాస్తోవ్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Comments

comments