Search
Friday 16 November 2018
  • :
  • :

హెలికాప్టర్ ప్రమాదంలో సౌదీ యువరాజు మృతి

ఆయనతో పాటు మరో ఏడుగురు దుర్మరణం

Saudi-Prince

దుబాయి: దుబాయి దక్షిణ సరిహద్దులో హెలికాప్టర్ కూలి పోవడంతో సౌదీ అరేబియా యువరాజులలో ఒకరైన మన్సూర్ బిన్ మోక్రెన్ మృతి చెందారు. ఆయనతో పాటు మరో ఏడుగురు కూడా మృత్యువాత పడ్డారు. మన్సూర్ బిన్ మోక్రెన్ అసిర్ ప్రావిన్స్‌కి డిప్యూటీ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. హెలికాప్టర్ కూలిన ప్రాంతం యెమెన్ సరిహద్దుకు 160 కిలో మీటర్ల దూరంలో ఉంది. యెమెన్‌లోని హూతి రెబట్స్‌కు వ్యతిరేకంగా 2015 నుంచి సౌదీ అరేబియా సైనిక సహకారం అందిస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మన్సూర్ 2015 జనవరి నుంచి ఏప్రెల్ వరకు మహారాజుగా బాధ్యతలు చేపట్టిన ముక్రిన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కుమారుడు. ప్రస్తుత హహారాజు సల్మాన్ కు కిరీటం కట్టబెట్టేందుకుగాను ముక్రిన్ ఆ స్థానం నుంచి తొలగించబడ్డారు. సౌదీ రాజు ప్రిన్స్ సల్మాన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 11మంది యువరాజులతో సహా నలుగురు ప్రస్తుత, 10 మందికి పైగా మాజీ మంత్రులు, మిలిటరీ అధికారులు, శక్తివంతమైన వ్యాపారులను శనివారం అరెస్టు చేయించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే యువరాజులలో ఒకరు హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాత పడడం కూడా చర్చనీయాంశమయ్యింది. ఈ దుర్ఘటనపై విచారణ చేస్తున్నారు.

Comments

comments