Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

స్వర్ణ సౌరభం

Saurabh Chaudhary wins gold in 10m air pistol event,

ఆసియా క్రీడల్లో భారత్‌కు మూడో బంగారు పతకం
పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో గెలుచుకున్న సౌరభ్ చౌదరి
షూటింగ్‌లో రజత, కాంస్య పతకాలు
సెపక్‌తక్రా రెజ్లింగ్‌లోనూ రెండు కాంస్యాలు

జకార్తా: ఆసియా క్రీడల్లో భారత్ మూడో స్వర్ణం సాధించింది. మంగళవారం షూటింగ్‌లో భారత్‌కు పసిడి పతకం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ సౌరభ్ చౌదరి స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ క్రీడల్లో భారత్‌కు ఇది మూడో పసిడి కావడం విశేషం. కాగా, షూటింగ్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకం సాధించాడు.  మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అభిషేక్ వర్మ కాంస్యం సాధించాడు. సెపక్‌తక్రా, రెజ్లింగ్‌లో కూభా భారత్‌కు కాంస్య పతకాలు లభించాయి. మంగళవారం జరిగిన షూటింగ్ పోటీల్లో భారత షూటర్లు అసాధారణ ప్రతిభతో అలరించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లో భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి పసిడి పతకం గెలిచి చరిత్ర సృష్టించాడు. సౌరభ్ 16 ఏళ్ల వయసులోనూ స్వర్ణం గెలిచి కొత్త రికార్డును నెలకొల్పాడు. క్వాలిఫయింగ్ రౌండ్ నుంచే సౌరభ్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. హేమాహేమీ షూటర్లను సైతం వెనక్కి నెడుతూ లక్షం దిశగా అడుగులు వేశాడు. చైనా, జపాన్, చైనీస్ తైపి, కొరియా షూటర్ల నుంచి ఎదురైన గట్టి పోటీని తట్టుకుంటూ పసిడి పతకం సాధించి భారత ఖ్యాతిని ఇనుమడింప చేశాడు. పూర్తి ఏకాగ్రతను కనబరిచిన సౌరభ్ 240.7 పాయింట్లతో జపాన్ షూటర్ టొమొయుకిను వెనక్కినెట్టి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఈ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం. షూటింగ్‌లో మాత్రం మొదటి పసిడి పతకం ఇదే. ఇక, భారత్‌కే చెందిన మరో షూటర్ అభిషేక్ వర్మ కూడా కాంస్యం సాధించాడు. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 29 ఏళ్ల అభిషేక్ 219.3 స్కోరుతో కాంస్యం దక్కించుకున్నాడు.

రాజ్‌పుత్ అసాధారణ ప్రతిభ..
మరోవైపు షూటింగ్‌లో భారత షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని సాధించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో భారత షూటర్ రాజ్‌పుత్ అసాధారణ ఆటతో రజతం సొంతం చేసుకున్నాడు. స్వర్ణం కోసం తీవ్రంగా పోరాడిన రాజ్‌పుత్ తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అంచనాలకు మించి రాణించిన రాజ్‌పుత్ 452.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని సాధించాడు. కాగా చైనాకు చెందిన షూటర్ జి చెంగ్ 453.3 పాయింట్లతో స్వర్ణం గెలుచుకున్నాడు.
సెపక్‌తక్రాలో కాంస్యం..
కాగా, సెపక్‌తక్రా పోటీల్లో భారత్‌కు కాంస్యం లభించింది. ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారి భారత్ సెపక్‌తక్రాలో పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన పురుషుల సెమీఫైనల్లో భారత్ 02 తేడాతో థాయిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. కాగా, ఇందులో ఓటమి పాలైనా భారత్‌కు కాంస్యం లభించింది. వాలీబాల్ తరహాలో సెపక్‌తక్రా పోటీలు ఉంటాయి. భారత్‌లో ఈ పోటీలకు అంత ఆదరణ ఉండదు. అయినా ఆసియా క్రీడల్లో భారత్ సెమీస్‌కు చేరడం మాములు విషయం కాదు. అసాధారణ ఆటతో భారత్ సెమీస్‌కు చేరి తన ఖాతాలో తొలిసారి పతకాన్ని జమ చేసుకుంది.

దివ్యకు కాంస్యం

మహిళల రెజ్లింగ్‌లో దివ్య కక్రాన్ కాంస్యం పతకం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల 68 కిలోల ఫ్రిస్టయిల్ విభాగంలో దివ్య 100 తేడాతో చైనిస్ తైపికు చెందిన చెన్ వెంగ్‌లిన్‌ను చిత్తు చేసింది. ఈ విజయం తో దివ్యకు కాంస్యం దక్కింది. అంతకుముం దు భజరంగ్ పునియా, వినీశ్ పొగట్‌లు రె జ్లింగ్‌లో స్వర్ణ పతకాలు సాధించిన విష యం తెలిసిందే. ఈ పోటీల్లో భారీ ఆశలు పెట్టుకున్న సాక్షి మలిక్, సుశీల్ కుమార్, తోమర్ తదితరులు నిరాశ పరిచారు. అయి తే దివ్య కాంస్యం గెలిచి కాస్త ఊరటనిచ్చిం ది. దివ్య కాంస్యంతో భారత్ పతకాల సంఖ్య పదికి చేరింది. ఇందులో మూడు స్వర్ణాలు, మరో మూడు రజతాలు కాగా, మరో నాలు గు కాంస్య పతకాలు ఉన్నాయి.

Comments

comments