Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

BJP-4

మనతెలంగాణ/ వికారాబాద్ జిల్లా ః వికారాబాద్‌లో శ్రీ రాం గోల్డ్ వరి విత్తనాలు నాటి నష్టపోయిన రైతు లను ప్రభుత్వం సకాలంలో ఆదుకోకపోతే వికారాబాద్ జిల్లా నుంచే రైతు పోరు యాత్రను ప్రారంభి స్తామని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు హెచ్చరించారు. ఆదివారం అనం తగిరి అటవీశాఖ అతిథిగృహంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారితో కలిసి ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీ రాం గోల్డ్ వరి విత్తనాలు వాడి పంటలు నష్టపోయామని రైతులు చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ విత్తనాల కంపె నీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిం చారు. వరి పంట నష్ట పోయిన రైతులకు కంపెనీ తరుపున నష్ట పరిహారం ఇపిస్తామని ప్రభుత్వం చెబుతుందే తప్పా ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతులకు నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన కంపెనీలపై పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారని, ఇప్పటివరకు ఎన్ని కంపెనీలపై కేసులు నమోదు చేశారని ప్రశ్నించారు.

 పాలకులు పేద రైతుల పక్షాన ఉండాలి తప్పా కంపెనీల పక్షాన ఉండరాదని రాష్ట్ర బిజెపి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తుందని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా 12 కోట్ల ప్రజలు పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, ఇంత పెద్ద సంఖ్యలో ప్రపంచంలో ఏ పార్టీకి కూడా కార్యకర్తలు లేరని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి నేతృత్వంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నాయకత్వంలో పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలకు అన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వికారాబాద్ జిల్లా శిక్షణ తరగతులకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారని, దీనికి పార్టీ జిల్లా నాయకత్వం కృషి ఎంత ఉందో తెలుస్తుందని కితాబునిచ్చారు.

శిక్షణ తరగతులలో 10 కాలాంశాలపై అన్ని రంగాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఈ శిక్షణ తరగతులలో పార్టీ కోసం పూర్తి స్థాయిలో 15 రోజులు, 30 రోజులు, సంవత్సరం పాటు పని చేసే కార్యకర్తల వివరాలను కూడా సేకరించడం జరిగిందన్నారు. త్వరలో జరిగే 5 రాష్ట్రాలలో ఏవరు ఊహించని విధంగా బిజెపి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని అందరిని ఆశ్చర్య పరుసుఉ్తందని ఆయన జోస్యం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కరుణం ప్రహ్లాద్‌రావు, జిల్లా ఉపాధ్యక్షులు కెపి రాజు, విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పాండుగౌడ్, రాము యాదవ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు టి.సదానంద్‌రెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శివరాజ్, మహా శిక్షణా తరగతుల కన్వీనర్ కె.మాధవరెడ్డి, నాయకులు వెంకటయ్య, పోకల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments