Search
Monday 24 September 2018
  • :
  • :

భయం భయంగా బడికి

save the public school these days, running private school

కడెం: మండలంలోని ధర్మాజిపేట్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువు పై శ్రద్ద ఉన్న విద్యార్థులను ముందుకు సాగిస్తున్న వసతులు వారిని వెనక్కి నెట్టెస్తున్నాయి. గత 5 ఏళ్లుగా సమస్యల మధ్య విద్యార్థులు కాలం వెళ్లాదిస్తున్నారు. పాఠశాల దుస్థితి పై అధికారులకు గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఎన్ని సార్లు చెప్పిన ఫలితం లభించలేదు. దీంతో పిల్లలను పాఠశాలలకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయందోళనకు గురవుతున్నారు.

(1) బడిని కాపాడుకున్న బాధలు తీరలేవు/ తిరుపతి ప్రధానోపాధ్యాయులు: ప్రైవేట్ పాఠశాల హావ నడుస్తున్నా ఈ రోజుల్లో ప్రభుత్వ బడిని కాపాడుకోవాలనే లక్షంతో బడి బాట కార్యక్రమం ఇలాంటి ఎన్నో కార్యక్రమాతో విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించుకున్నాం. పాఠశాలలో ఒకడే ఉపాధ్యాయుడు ఉండడంతో గ్రామస్తులు ఇద్దరు టీచర్లను నియమించారు. అయితే పాఠశాల భవనం పూర్తిగా చెడిపోయింది. పాఠశాలలో మొత్తం 75 మంది విద్యార్తులు ఉండగా ఒకే గదిలో బోధన జరుగుతుంది. తరగతి గదులు లేక పోవడంతో విద్యార్థులు వరండాలలో, ఆరుబయట చెట్ల క్రింద చదువులను కొనసాగిస్తున్నారు. అధికారులు ఇప్పటికైన స్పందించి నూతన పాఠశాల భవనం ఏర్పాటు చేస్తే బాగుటుంది.

(2) పెచ్చులుడుతున్నాయి, విద్యార్థి /ఎన్.ఆమూల్య: 5వ పాఠశాలలో మాకు కనీస సౌకర్యాలు లేవు. పాఠాలు వింటున్న సమయంలో ఎప్పుడు ఏ ప్రమాదం సంబావిస్తుందో అని భయంగా ఉంది. అధికారులు మా బాధలను చెవిన బెట్టి సమస్యలను పరిష్కారం చూపండి.

(3) సౌకర్యాలు కల్పించాలి : గ్రామస్తుడు సత్యం: పిల్లలలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపాలని తీర్మానించుకున్నాం. గ్రామస్తుంలదరం కలిసి ఇద్దరు టీచర్లును కూడా నియమించాం. కానీ పాఠశాల భవనం పూర్తిగా ఇలా చెడిపోవడంతో విద్యార్థులు భయందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి నూతన విద్యా భవనం మంజూరు చేయాలని కోరుతున్నాం.

Comments

comments