Home మంచిర్యాల అటవీ సంపదను కాపాడండి

అటవీ సంపదను కాపాడండి

జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్

save Tree

మంచిర్యాలప్రతినిధి: జిల్లా అటవీజంతు సంరక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయ స మావేశ మందిరంలో బుధవారం రోజున జిల్లా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అ టవీ సంపదను కాపాడుటకు అన్ని ప్రభుత్వ శాఖల అధికా రులు సమష్టిగా కృషి చేయాలన్నారు. పోలీసు, అటవీ శాఖ, డిఆర్‌డిఎ ఎక్సైజ్, రెవెన్యూ, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అటవీ సంపదను కాపాడాలని కోరారు. గు డుంబా తయారీని అరికట్టాలని, కలప స్మగ్లింగ్ జరుగకు ండా చూడాలని అవసరమైతే కేసులు పెట్టాలన్నారు.

గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసిన అటవీ సంపద కాపాడుటకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ గు డుంబా తయారీ,కలప స్మగ్లింగ్,జంతువులను వేటాడు టకు కరెంట్ తీగలు అమర్చుట చేయరాదని వీటిని అరి కట్టుటకు గ్రా మస్దులు అధికారులకు సహాయ ప డాలన్నారు. అటవీ డివిజన్ ప్రాంతాలలో, ఎక్కువగా ఉన్న అటవీ ఉన్న ప్రాంతాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగా హన కల్పిం చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ .సుధాకర్‌రావు, మంచిర్యాల ఎసిపి చెన్నయ్య, జిల్లా అటవీశాఖాధికారి ప్రభాకర్,ఎక్సైజ్ సూపరింటెం డెంట్ శ్రీనివాస్, డిఆర్‌డిఎ పిడి వెంకట్, రూరల్ డెవలప్ మెంట్ అధి కారులు, డ్వామా పిడి,అటవీ శాఖ డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
దివ్యాంగులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి

సమాజంలోని దివ్యాంగులకు ప్రొత్సాహం కలిగిస్తూ ఆత్మవిశ్వాసాన్ని అందిస్తే వారు అకవకాశాలను సద్విని యోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని సాయి అంధుల పాఠశాలలో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి, వేడుకలను ప్రారంభించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చూపులేని వారి కోసం బ్రెయిలీ ఎంతో కృషి చేశారని పేర్కొంటూ ఆ మహనీ యుని కృషి వలనే చూపులేని వారు స్పర్షతో అక్షరాలను నేర్చుకుంటూ అనుకున్న లక్ష్యాలను చేరుతూ సాధారణ వ్యక్తులకు ధీటుగా రానించడం ఆదర్శనీయమన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తయారు చేసిన బ్రేయిలీ క్యాలెండర్‌ను కలెక్టర్‌ను ఆవిస్కరించి, విద్యార్థులు ప్రొత్సాహ బహమతులు అందించారు. విద్యార్థినీ విద్యార్థులు తమ ఆట పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రవూఫ్‌ఖాన్, పాఠశాల నిర్వాహకులు అశోక్‌రావుతో పాటు పద్మ, రుక్మిణి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.