Home జాతీయ వార్తలు బిజెపికి సావిత్రిబాయి ఫూలే రాజీనామా

బిజెపికి సావిత్రిబాయి ఫూలే రాజీనామా

న్యూఢిల్లీ: సమాజంలో చీలికలు సృష్టించడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ఆ పార్టీ తరఫున బహరిచ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సావిత్రిబాయి ఫూలే పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి నాడు బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

ఈరోజు నుంచి బిజెపితో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను దళితురాలిని కాబట్టే పార్టీలో నన్ను పట్టించుకోవడం లేదు. దళితులు, వారి హక్కులకు వ్యతిరేకంగా పార్టీలో భారీ కుట్ర జరుగుతోంది. దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన రిజర్వేషన్లను క్రమంగా లాగేసుకుంటున్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తాను. జనవరి 23న లక్నోలో భారీ ర్యాలీ నిర్వహిస్తానని ఆమె చెప్పారు. ఎంపి పదవీకాలాన్ని కొనసాగిస్తానని ఆమె తెలిపారు.

Savitribhai Phule resigns for BJP