Search
Thursday 15 November 2018
  • :
  • :

సా….గని సాగు

farmer* ఖరీఫ్‌లో సాగని
16.618 హెక్టార్లు సాగు
* సాధారణ సాగును మించిన పత్తి

* తాలూకాలో వరికి తగ్గిన ఆదరణ

* 50 శాతం పడిపోయిన మిర్చిసాగు
* పొగాకు సాగుకు పొగ

నడిగడ్డ ఒట్టిపోతోంది. రెండు నదుల నీరు కళ్లెదుటే ఉన్నా చేనుకు నీరందదు. కర్షకుడు వాననీటికై కళ్లు కాయలుకాచేలా ఎదురు చూడటం ఇక్కడ పరిపాటి. వర్షాధార పంటలు అతివృష్టి, అనావృష్టితో రైతులు కంటికి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఒకే పంటపై ఆధారపడ్డ అన్నదాత ఆశలు ఆవిరైపోతున్నాయి. కాయకష్టంతో ఎరువులు మందులకు అన్నదాతలు అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నాడు. చేతికి వచ్చిన పంట అప్పులకు చేజారిపోతోంది. దళారులు దయ్యాలై పంటలను పీక్కుతింటున్నాయి. సాధారణ సాగుకు అనువుగా ఉన్నా అన్నదాతలు అప్పుల భారం మోయలేక సాగుకు దూరమవుతున్నారు. సాగని సాగుపై ప్రత్యేక కథనం…మనతెలంగాణ/అలంపూర్: ఖరీఫ్‌లో సాధార ణ సాగు 63573 హెక్టార్లు కాగా 46955 హె క్లార్లలో సాగు జరిగింది. 16.618 హెక్టార్లలో ని రైతులు సాగుకు దూరమయ్యారు. తాలూ కాలో సాగు చేసిన పంటలను ఓ సారి పరిశీలి ద్దాం.
తాలూకాలో ఖరీఫ్ సాగు: తాలూకాలో వరి సాధారణ సాగు 6222 హెక్టార్లలో ఉండగా 2119 హెక్టార్లలో సాగు జరిగింది. దీంతో వరి పంట ఉత్పత్తులు తగ్గిపోయాయి.మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 7556 హెక్టార్లు కాగా 523 8 హెక్టార్లు సాగైంది. కందులు 8328 హెక్టార్ల సాధారణ సాగు ఉండగా 5346 హెక్టార్లలో పంటలు పండించారు. పత్తి సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగా సాగుచేశారు. పత్తి 21420 హెక్టార్లలో సాధారణ సాగు ఉండగా రైతులు 25220 హెక్టార్లలో సాగు చేశారు. గత ఏడాది పత్తి ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు పత్తి పంటపై మొగ్గుచూపారు. గత ఖరీఫ్‌లో మిర్చి అధిక సాగు జరిగింది. కాగా గిట్టుబాటు ధర లు లేకపోవటంతో ఇప్పటికీ మిర్చి ఉత్పతులు గోదాములకే పరిమితమయ్యాయి. దీంతో రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌లో మిర్చి పంట సాగు కు మొగ్గు చూపలేదు. మిర్చి సాధారణ సాగు 7251 హెక్టార్లు ఉండగా 3722 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. చెరుకు సాధారణ సా గు 384 హెక్టార్లుండగా 468 హెక్టార్లలో సాగు చేయటంతో 84 హెక్టార్ల సాగు విస్తీర్ణం పెరిగింది.
తాలూకాలో ప్రధాన పంటలను
పరిశీలిస్తే తగ్గిన వరి నాట్లు :
తాలూకాలో వరి నాట్లు తగ్గిపోయాయి. సా గునీటి వ్యవస్థ, భూగర్భజలాల బోర్లపైనే వరి సాగు ఆధారపడి ఉండటంతో రైతులు వరి సా గుకు మొగ్గు చూపలేదు. అడుగంటిన భూగ ర్భజలాలతో రైతులు వరికి వెనుకడుగు వేశా రు. అలంపూర్ మండలంలో సాధారణ వరిసా గు 210 హెక్టార్లు కాగా 23 హెక్టార్లలో సాగు జరిగింది. మానవపాడులో నీటి వనరులు లేక ఖరీఫ్‌లో వరి సాగు సాగులేదు. వడ్డెపల్లిలో సా ధారణ సాగు 856 హెక్లార్లుండగా 26 హెక్టా ర్లలో మాత్రమే సాగైంది. ఐజ మండల పరిధి లో అత్యధిక సాధారణ సాగు విస్తీర్ణం 2723 హెక్టార్లుండగా సాగునీటి లభ్యత లేకపోవటం తో 67 హెక్టార్ల పరిధిలోని రైతులు మాత్రమే నాట్లు వేశారు.ఇటిక్యాల మండల పరిధిలో వరి సాగు ఆశాజనకంగా ఉంది. సాధారణ సాగు 1998 హెక్లార్లు కాగా 1599 హెక్టార్లలో సాగు చేశారు. ఉండవెల్లి మండల పరిధిలో సాధారణ సాగు 12 హెక్టార్లుండగా రైతులు నీటి బోర్ల ఆధారంగా 36 హెక్టార్లలో వరి వేశారు. రాజోలి మండల పరిధిలో సాధార ణ సాగు 239 హెక్టార్లుండగా 368 హెక్టార్లలో వరి సాగు చేశారు.
వడ్డెపల్లిలో సాగని మొక్కజొన్న:
తాలూకాలోని వడ్డెపల్లి మండలంలో మొక్కజొ న్న సాగుకు నోచుకోలేదు. అలంపూర్ మండల పరిధిలో మొక్కజొన్న సాగు ఆశాజనకంగా సా గింది. అలంపూర్ మండల పరిధిలో సాదార ణ సాగు 4045 హెక్టార్లు కాగా 3249 హెక్టార్లలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. మానవపా డులో 1223 హెక్టార్లలోని సాధారణ సాగులో 168 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఐజలో 165 హెక్టార్ల సాగుండగా 77 హెక్టార్ల పరిధిలో ని రైతులు మొక్కజొన్నకు మొగ్గుచూపారు. ఇటిక్యాలలో 79 హెక్టార్లలో సాగు చేయాల్సిన పరిస్థితులుండగా 38 హెక్టార్లలో మాత్రమే సా గు చేశారు.
ఉండవెల్లిలో సాధారణ సాగుకంటే 21 హెక్టార్లు అధికంగా సాగు చేశారు. ఏది ఏమైనా తాలూకాలో సాగు సాగునీరులేక తగ్గు ముఖం పడుతోంది. ఆర్‌డిఎస్ చివరి ఆయకట్టు గత మూడు దశాబ్దాలుగా సాగునీటి చుక్కను చూడలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సాగునీటి పధకాలపై చొరవతీసుకొని వచ్చే ఖరీఫ్‌నాటికి సాగునీరు కల్పించాలని కర్షకులు కోరుతున్నారు.

Comments

comments