Home తాజా వార్తలు ఎస్‌బిఐ వినియోగదారులకు గుడ్ న్యూస్

ఎస్‌బిఐ వినియోగదారులకు గుడ్ న్యూస్

SBI

ముంబయి: అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ) వినియోగదారులకు తీపి కబురు అందించింది. ఇంతకుముందు గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును తగ్గించిన ఎస్‌బిఐ తాజాగా  కారు, బంగారం, వ్యక్తిగత రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును 100 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు కారు రుణాలపై, అక్టోబర్‌ 31 వరకు బంగారం రుణాలపై, సెప్టెంబర్‌ 30 వరకు వ్యక్తిగత రుణాలపై వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. పండుగ సీజన్ కావడంతో వినియోగదారులకు ఈ ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నట్లు బ్యాంక్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.