Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మొబైల్ ఎటిఎం సేవలకు ఎస్‌బిఐ శ్రీకారం

ATM-2

మన తెలంగాణ/గజ్వేల్ : ఎస్‌బిఐ బ్యాంకు ఆధ్వర్యంలో సంచార ఎటిఎంల సేవలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపధ్యంలో శనివారం గజ్వేల్ మండలం అహ్మదీపూర్‌కు ఎటిఎం మొబైల్ వాహనం చేరింది. ఈ మొబైల్ ఎటిఎం వాహనం గ్రామానికి రాగానే గ్రామస్తులు దాని చుట్టూ గుమికూడారు. ఆధునాతన సౌకర్యాలున్న వాహనంలో చేరుకున్న ఎటిఎం ద్వారా డబ్బు అవసరం ఉన్న పలువురు ఖాతాదారులు తమ ఎటిఎం కార్డులు పైప్‌చేసి డ్రాచేసు కున్నారు. తమ గ్రామానికి ఇలా మొబైల్ ఎటిఎం రావటం తమకు చాలా సౌకర్యంగా మారిందని గ్రామస్తులు సంతోష వ్యక్తం చేశారు.
గజ్వేల్ బ్యాంకుకు వెళ్లాలంటే దూరా భారంతోపాటు తీరా అక్కడ భారీ క్యూలైన్‌లో నిలుచున్న ప్పటికీ ఎటిఎంలో డబ్బు తమదాకా వస్తుందో లేదో తెలియదని అన్నారు. ఎస్బీఐ వారు తమ ఇబ్బందులను గుర్తించి ఎటిఎం సేవలు అందించటం పట్ల బ్యాంకు అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు ఇదే గ్రామంలో ఎటిఎం వినియోగ దారులకు తన సేవలు అందిస్తామని ఎఎం నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, పాలరమేష్, సర్పంచ్, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

Comments

comments