Home తాజా వార్తలు ఎటిఎం కార్డు లేకుండానే డబ్బులు డ్రా

ఎటిఎం కార్డు లేకుండానే డబ్బులు డ్రా

YONO Cash
యోనోక్యాష్‌తో కార్డ్‌లెస్ ఎటిఎం విత్‌డ్రాను ప్రవేశపెట్టిన ఎస్‌బిఐ

హైదరాబాద్: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ సరికొత్త టెక్నాలజీలతో వినియోగదారులకు మరింత చేరువ అవుతోంది. తాజాగా ఎటిఎం కార్డు లేకుండా డబ్బులను విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని ‘యోనో ఎస్‌బిఐ’ యాప్ ద్వారా కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా 16,500 ఎస్‌బిఐ ఎటిఎంలలో కార్డు లేకుండా డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు యోనో క్యాష్‌ను సంస్థ ఆవిష్కరించింది. యోనో క్యాష్ ఆవిష్కరణతో దేశంలో ఈ తరహా సేవలను అందిస్తున్న మొట్టమొదటి బ్యాంక్‌గా ఎస్‌బిఐ నిలిచింది. ఈ సేవల కోసం వినియోగించే ఎటిఎంలను యోనో క్యాష్ పాయింట్‌గా పిలుస్తారు. కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడం ద్వారా స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలను తగ్గించొచ్చని ఎస్‌బిఐ భావిస్తోంది. యోనో యాప్‌లో యోనో క్యాష్ ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సాధ్యమవుతుంది. వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా వేసిన మరో ముందడుగు యోనో క్యాష్ ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు.

ఎలా ఉపయోగించుకోవాలి?

1. స్మార్ట్‌ఫోన్‌లో ‘YONO’ యాప్ డౌన్‌లోడ్ చేయాలి.
2. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ యోనో క్యాష్ క్లిక్ చేయాలి.
3. అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి.
4. 6 అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి.
5. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నంబర్ ఎస్‌ఎంఎస్ వస్తుంది.
6. ఈ రిఫరెన్స్ నెంబర్ 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది.
7. మీకు దగ్గర్లో ఉంటే యోనో క్యాష్ పాయింట్‌కు వెళ్లాలి.
8. ఎస్‌ఎంఎస్‌లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి.
9. మీరు యాప్‌లో ఎంటర్ చేసిన నగదును ఎటిఎంలో ఎంటర్ చేయాలి.
10. తర్వాత యోనో క్యాష్ పిన్‌ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవాలి.

SBI launches cardless ATM withdrawal with YONO Cash