Home తాజా వార్తలు వాట్సాప్ స్కామ్‌తో జాగ్రత్త…

వాట్సాప్ స్కామ్‌తో జాగ్రత్త…

WhatsAppన్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ కస్టమర్లకు పలు హెచ్చరికలు చేస్తోంది. కొత్తగా వెలుగుచూస్తున్న వాట్సాప్ స్కామ్‌ల పట్ల జాగ్రత్త వహించాలని ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) హెచ్చరిస్తోంది. ఎస్‌బిఐ ఖాతాదారులు ఎక్కువ ఉండడంతో నేరగాళ్లు ఈ బ్యాంక్ అకౌంట్లను టార్గెట్ చేస్తున్నారు. వాట్సప్‌తో పాటు సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఒటిపి చెప్పాలంటూ ఖాతాదారులకు ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయని ఎస్‌బిఐ ట్విట్టర్‌లో వెల్లడించింది.

ఇలాంటి మోసాల పట్ల ఖాతాదారులు ఎలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాట్సప్‌లో వచ్చే మెసేజ్‌ల ను పట్టించుకోవద్దని, లింక్స్‌తో వచ్చే ఎస్‌ఎంఎస్‌లనూ క్లిక్ చేయొద్దని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లో కార్డు వివరాలు, బ్యాంకు అకౌంట్ నెంబర్లు, ఒటిపి ఎవరికీ చెప్పొద్దని తెలిపింది. మీరు మీ ఫోన్ ద్వారా ఎక్కువగా లావాదేవీలు జరిపేట్టయితే యాంటీవైరస్ వాడాలి. ఒకవేళ మీరు ఇలాగే మోసపోతే 3రోజుల్లో బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. 1800111109 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా ’Problem’ అని టైప్ చేసి 9212500888 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలి.

 

SBI warns about WhatsApp