Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఎవర్ గ్రీన్ సిగ్నల్

SC dismisses petition against Telangana Kaleshwaram Project

కాళేశ్వరం పై ప్రధాన పిటిషన్‌ను కొట్టివేసిన గ్రీన్ ట్రిబ్యునల్

విచారణ సంఘాన్ని నియమించాలని
కోరుతూ దాఖలైన పిటిషన్‌కూ అదేగతి
అసలు వ్యాజ్యాన్ని తోసిపుచ్చడం శుభ
సూచకం : ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరామ్
మంత్రి హరీశ్‌రావు హర్షం

మన తెలంగాణ/ న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దాఖలైన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) మంగళవారం కొట్టివేసింది అదే విధంగా ఎంక్వయిరీ కమిటీ వేయాలన్న అప్పీల్‌ను కూడా కొట్టివేసింది. రాజ్యాంగ న్యాయస్థానాలే కేసు కొట్టేసిన తర్వాత ఈ అంశంపై విచారించడానికి ఏముందని పిటిషనర్‌ను ఎన్‌జిటి ధర్మాసనం ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి కే అన్ని అనుమతులూ వచ్చాయని, దీనిపై విచారణ జరపాల్సిన అవసరం లేదని, ఎంక్వయిరీ కమిటీ వేసి క్షేత్రస్థాయి పరిశీలన జరపాల్సిన అవసరం కూడా లేదని జస్టిస్ రాఘవేంద్ర రాథోడ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన అటవీ, పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని వేసిన మరో పిటిషన్‌పై విచారణను సెప్టెంబర్ 17 తేదీకి వాయి దా వేసింది. కాళేశ్వరంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో  వేసిన ముఖ్యమైన కేసు కొట్టివేయడం శుభ సూచకమని కేసును పర్యవేక్షిస్తోన్న ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరామ్ వ్యాఖ్యానించారు. ఇప్పటి కే కేంద్ర జలవనరుల శాఖతో (మొదటిపేజీ తరువాయి)
పాటు, పర్యావరణ, అటవీ, హైడ్రాలజీ అనుమతులన్నీ వచ్చిన తర్వాత విచారించేది ఏముందని ఎన్‌జిటి వ్యాఖ్యానాలను హరిరాం గుర్తుచేశారు.
మంత్రి హరీష్ రావు హర్షం: ఎన్‌జిటి తీర్పుపై మంత్రి హరీష్ రావు హర్షం వెలిబుచ్చారు. ప్రాజె క్టు వ్యతిరేకులకు జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పు ఒక చెంప పెట్టు లాంటిదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని ప్రతిపక్షాలను మంత్రి కోరారు. దేశంలో ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలంటూ పిటిషన్లు వేసిన చరిత్ర తెలంగాణలో తప్ప మరెక్కడా కానరాదని గుర్తుచేశారు. ప్రాజెక్టుల గురించి, ఇతర రాష్ట్రాల్లో తమ రాష్ట్ర ప్రయోజనాల గురించి అంతా ఒక్క తాటిపై నిలిస్తే… మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రం ప్రాజెక్టులు కట్టకుండా అడ్డం పడుతున్నారని విమర్శించారు. ఎన్‌జిటి తీర్పును చూసి అయినా పిటిషన్లను వెనక్కి తీసుకోవాలని హరీశ్ హితవు పలికారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు లభించిన అనుమతులు:
పర్యావరణ ప్రభావ నివేదిక తయారీకి టిఒఆర్ జారీ 31.03.2017
మేడిగడ్డ వద్ద 75% డిపెండబిలిటీతో 283.3 టిఎంసిలకు హైడ్రాలజీ క్లియరెన్స్ 30.10.2017
అంతర్రాష్ట్ర అనుమతి 03.11.2017
కేంద్ర భూగర్భ జల శాఖ అనుమతి 21.11.2017
నిర్మాణం, భారీ యంత్ర పరికరాల డైరెక్టరేట్ అనుమతి 21.11.2017
అటవీ మంత్రిత్వ శాఖ తుది అనుమతి 24.11.2017
పర్యావరణ తుది అనుమతి 05.12.2017
ఇర్రిగేషన్ ప్లానింగ్ 13.04.2018
ప్రాజెక్టు అంచనా విలువ 30.04.2018
కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటి (టిఏసి) అనుమతి 01.06.2018

Comments

comments