Search
Wednesday 21 November 2018
  • :
  • :

అక్రమ మందు దందాలకు బ్రేక్

Wine-Shop

బాడర్‌లపై బార్లు బంద్, వ్యాపారుల్లో కలవరం
మద్యం షాపుల మార్పిడికి ప్రయత్నాలు
తొలగింపుకు ఆబ్కారీ కసరత్తులు

మన తెలంగాణ/ కామారెడ్డి ప్రతినిధి : సుప్రీం కోర్టు ఆదేశాలతో మద్యం వ్యాపారుల్లో కలకలం రేపింది. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాపులు, సిట్టింగ్ దాబాలకు ఇది గుదిబండగా మారింది. అక్రమ మద్యం దందాలకు బ్రేక్ పడింది. అధికారులకు మామూళ్ల మత్తులో జోగిస్తూ ఇంతకాలం రూల్స్‌కు విరు ద్ధ్దంగా వ్యాపారాలను సాగించుకున్నారు. ప్రజల నుండి పిర్యాదులు వచ్చినా చర్యలు చేపట్టేందుకు వెనుకంజ వేశారు. చాలాచోట్ల పాఠశాలల సమీపంలో వైన్ షాపులను ఏర్పాటు చేసుకున్నారు. దేవాలయాల ప్రాంతాలలో కూడా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని జాతీయ రహదారికిరువైపుల చాలా వరకు మద్యం సిట్టింగులతో దాబాలు, బార్లు నడుస్తున్నాయి. రోడ్డుకు 50 నుండి 100 మీటర్ల దూర వ్యత్యాసంలో ఈ దందాలు నడుపుతున్నారు.

రాత్రిం బవళ్లు సమయ పాలన లేకుండా నిత్యం తెరిచి ఉంచుతూ మద్యం అమ్మకాలే కాకుండా సేవించేందుకు అటాచ్ రూంలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో వంద వరకు మద్యం షాపులు రోడ్డుకు దగ్గరలో ఉన్నాయి. అదే విధంగా మరో యాభై వరకు దాబాలు బైపాస్, జాతీయ రహదారులకిరువైపుల నడుస్తున్నాయి. కామారెడ్డిలో కూడా వంద వరకు రోడ్డుకు అటు ఇటు మద్యం దందాలు ఉన్నాయి. దాబాలు కూడా రోడ్డు పక్కనే ఏర్పాటు చేసుకున్నారు. వీరందరికీ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు వర్తించనున్నాయి. నిబంధనలు అతిక్రమించి ఇకమీదట మద్యం దందాలు నడిపే అవకాశం లేకుండా ఖచ్చితమైన చర్యలు చేపట్టనున్నారు. దీంతో పది వేల మంది వరకు మద్యం దందాలలో పనిచేసే కార్మికులతో పాటు వ్యాపారులు రోడ్డునపడనున్నారు.

మహారాష్ట్రలో తెలంగాణ వ్యాపారులు: సిద్ధిపేటకు చెందిన బొడిగే శ్రీనివాస్ రెండు సంవత్సరాల క్రితం బార్‌లో అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో బార్ మూసుకోవాల్సి వస్తోంది. నిబంధనలకు విరుద్దంగా నడపడం తప్పే. కాని ఆశపడి పెట్టుబడి పెట్టా. ఇప్పుడు నష్టపోతున్నా… అలాగే ఇప్పటికే మహారాష్ట్రలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అక్కడున్న బార్ అండ్ రెస్టారెంటులతో పాటు వైన్ వ్యాపారాలను తొలగించి ఐదు వందల మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నోటీసులు అందాయి. మహారాష్ట్రలో సుమారు 25 వేలకు పైగా మద్యం షాపులు నడుస్తున్నాయి. అందులో 8440 షాపులు హైవే రహదారికిరువైపుల ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో తెలంగాణ నుండి వలస వెళ్లి స్థిరపడ్డ వ్యాపారులే ఎక్కువగా ఉన్నారు. మెదక్, సిద్ధిపేట్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన రెండు లక్షల మంది వరకు ఈ వ్యాపారంలో మునిగితేలుతున్నారు. దాదాపు 25 ఏళ్ల నుండి అక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరందరిపై సుప్రీం కోర్టు ఆదేశాల దెబ్బ పడనుంది. గత రెండేళ్ల నుండి కోట్లాది రూపాయలను వెచ్చించి అక్కడ మధ్యం దందాలను తెరిచిన వారు నేడు పరేషాన్‌లో పడ్డారు.

మందు దందాలకు గడ్డుకాలం: మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. దినసరి కూలీలతో పాటు వ్యాపారులు, ఉద్యోగులు ప్రతి రోజు మద్య సేవనాన్ని అలవాటు చేసుకోవడంతో ఇక్కడ మద్యం వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. దాంతో చాలా చోట్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు మద్యం మత్తులో వాహనాలను నడపడం వల్లనేనని సుప్రీం కోర్టు గుర్తించింది. తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న దృష్టా, ప్రభుత్వం ఆదాయ మార్గాలను అన్వేషించకుండా జాతీయ రోడ్డు కిరువైపుల ఉన్న వైన్, బార్ అండ్ రెస్టారెంట్లను తొలగించాల్సిందిగా కఠినంగా ఆదేశించింది. ఈ మెరకు ఆబ్కారీ శాఖ కసరత్తులు చేస్తోంది. గడువు లోపు మందు షాపులను మార్చేందుకు వ్యాపారులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులకు నోటీసులను తయారు చేసింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలోని రోడ్డు పక్కన ఉన్న బార్లను, వైన్ షాపులు, దాబాలను తొలగించాలంటూ ఆబ్కారీ అధికారులు సూచనప్రాయంగా నోటీసులను అందించే పనిలో ఉన్నారు.

రోడ్డుకు ఐదు వందల మీటర్ల దూరంలో ఈ షాపులను ఏర్పాటు చేసుకునే వెసలుబాటుతో పాటు తిరిగి పునః ప్రారంభానికి ఏలాంటి సుంకం చెల్లించేందుకు అవకాశం లేకుండా వ్యాపారులకు అండగా నిలిచింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మార్చి 31వ తారీఖు లోపు ఇలాంటి వ్యాపారాలు ఎక్కడ కూడా నడుపరాదని తేల్చి చెప్పింది. అలాగే దేవాలయాలు, విద్యాలయాలు, ప్రార్థనాస్థలాలకు కూడా ఐదు వందల మీటర్ల దూర వ్యత్యాసంతో మద్యం వ్యాపారాలను నెలకొల్పాలని సూచించడంతో వ్యాపారుల్లో గుబులు రేపుతోంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆదేశాలను అమలు చేయని వైన్ వ్యాపారాల లైసెన్సులను రద్దు చేయనున్నారు. కటాఫ్ డేట్ తరువాత ఒక్క రోజు కూడా మినహాయింపును ఇవ్వలేదు. ఖచ్చితంగా మార్చి 31 లోపు నిబంధనలకు అడ్డుగా ఉన్న ప్రాంతాల్లోని మద్యం దందాలు మార్పు చేసుకోవాల్సిందే. కాదు కూడదనుకున్న వ్యాపారులు దందాకు దూరం అయ్యే పరిస్థితిలు ఉన్నాయి.

సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మహిళలు ప్రశంసిస్తుండగా, వ్యాపారులు మాత్రం లబోధి బోమంటున్నారు. పాత అడ్డాలను విడిచిపెట్టి కొత్త అడ్డాలోకి మారా లంటే అందుకు అనుకూల స్థలాలు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరో నెలన్నర రోజుల్లో ఇన్నేళ్లు దందాచేసిన వారంతా బిస్తర్ సదురుకొని బిచానా ఎత్తేయాల్సిందే. జిల్లాలో చాలా చోట్ల ఈ విధమైన పరిస్థితే కని పిస్తోంది. ఏదేమైనా దర్జాగా దందానడిపించుకోవచ్చునని ఏర్పాటు చేసుకున్న వైన్, బార్ అండ్ రెస్టారె ంట్లకు మాత్రం గడ్డుకాలం పట్టుకుంది. పెట్టిన పెట్టుబడులు ఇంకా చేతికి రాక వ్యాపారుల గుండెల్లో గుబులు నిండు తోంది. అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మందు దందాలకు నోటీసులను అందించేందుకు ఏర్పాట్లు చేసు కుంటున్నారు.

Comments

comments