Home స్పెషల్ ఆర్టికల్స్ భరత్‌రెడ్డిపై ఎస్‌సి, ఎస్టీ కేసు

భరత్‌రెడ్డిపై ఎస్‌సి, ఎస్టీ కేసు

police

మనతెలంగాణ/నవీపేట (నిజామాబాద్ జిల్లా): ఇద్దరు దళిత యువకులను భయాందోళనకు గురి చేసిన భరత్‌రెడ్డిపై ఎస్‌సి, ఎస్టీ కేసు నమోదు చేశామని దీని పై ఎసిపి సుదర్శన్ విచారణ చేస్తున్నట్లు నిజామబాద్ సిపి కార్తికేయ తెలిపారు. అభంగపట్నం గ్రామంలో గల బాధితులు అయిన లక్ష్మణ్,రాజేశ్వర్‌ల ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి విలేకరులతో మాట్లాడుతూ సదరు నిందితునిపై దళిత సంఘాల ఫిర్యాదు మేరకు ఐపిసి 506, ఎస్‌సి, ఎస్టీ పిఓఎ ప్రకారం కేసు నమోదు చేశామని కమిషనర్ తెలిపారు. సిపి వెంట ఎసిపి , సిఐ బుచ్చయ్య, ఎస్‌ఐ నరేష్ పోలీసు సిబ్బంది ఉన్నారు.