Home తాజా వార్తలు ఆర్మీ రిక్రూట్‌మెంట్ లో కుంభకోణం

ఆర్మీ రిక్రూట్‌మెంట్ లో కుంభకోణం

 Scam in army recruitment
మన తెలంగాణ/ హైదరాబాద్: మిలిటరీ ప్రాంగణాల్లోని ఆలయాలకు మత గురువులను నియమించడంలో 2013లో జరిగిన భారీ కుంభకోణం కేసులో సిబిఐ ఎసిబి డిఎస్‌పి ఎం.కృష్ణమోహన్ 17 మంది నిందితులను గుర్తించారు. ఇం దులో 12 మంది ఆర్మీ అధికారులు కాగా, మరో ఐదుగురు ప్రైవేటు వ్యక్తులున్నారు. దేశ వ్యాప్తం గా సంచలనం రేపిన ఈ కేసులో సిబిఐ ఎసిబి అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసు నమోదైన 12 మంది ఆర్మీ ఆధికారులు మహేంద్ర నారాయణ త్రిపాఠి, సత్యప్రకాష్, ఎం.కె.పాండ్య, నారాయణ్ తివారి, ప్రవీణ్ కుమార్, శివ పూజాన్ డేవిడ్, జితేంద్ర కుమార్ యాదవ్, జగదీష్ నారాయణ్ పాండే, బాల్ కృష్ణ గార్గ్, మహేందర్‌మిశ్రా, రాజేష్‌కుమార్ గోస్వామి, శక్తిదర్ తివారిలను ఆర్మీ అధికారులు సస్పెండ్ చేశారు.

ఇక ఇదే కేసులో నిందితులు ఉన్న ప్రైవేటు వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన ఇద్రజిత్ గుప్తా, మిత్తిలాల్ గుప్తా, అమర్‌నాథ్ గుప్తా, విశ్వజిత్‌గుప్తా, పాంకి బిత్తరెలను సిబిఐ ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిందరి బ్యాంక్ అకౌంట్‌లను అధికారులు సీజ్ చేశారు.