Home తాజా వార్తలు ఉద్యోగాల పేరుతో మోసాలు

ఉద్యోగాల పేరుతో మోసాలు

Hyderabad : Scams in Name of jobs

హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ ముఠాకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేశామని ఆయన పేర్కొన్నారు. వీరి నుంచి రూ.24.1 లక్షల నగదుతో పాటు నకిలీ నియామక పత్రాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఉద్యోగాల పేరిట మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమకు తారసపడే అనుమానితుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

Scams in Name of jobs at Hyderabad