Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఐటమ్ సాంగ్‌కు ఓకే

ITem-Song

టాలీవుడ్‌లో ఐటమ్‌సాంగ్‌లకు కొదవలేదు. ఆ ఐటమ్ సాంగ్‌ల కోసమే కొందరు సినీ అభిమానులు థియేటర్లకు వస్తారు. వారిని మెప్పించడానికి ప్రతి దర్శకుడు ఈ స్పెషల్ సాంగ్స్‌ను ప్రత్యేకంగా తెరకెక్కిస్తారు. ‘రంగస్థలం’ తీసిన సుకుమార్ నుంచి రాజమౌళి వరకు ఈ ఐటమ్ సాంగ్ ఫార్ములాను పాటిస్తూనే ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో ఓ ఐటమ్‌సాంగ్‌తో స్కార్లెట్ విల్సన్ టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆతర్వాత బాహుబలి సినిమాలో ‘మనోహర…’ పాటతో పాపులర్ అయింది. ఈ బ్రిటీష్ అందగత్తె వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఐటమ్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకుంది. వయ్యారాలు ఒలకబోస్తూ ఆమె చేసే డ్యాన్సులకు ఫిదా అయి కొందరు దర్శకులు ఆమెకు వరుసగా ఆఫర్లు ఇస్తున్నారు. తాజాగా స్కార్లెట్‌కు మరో అవకాశం వచ్చింది. షకలక శంకర్ హీరోగా నటిస్తున్న ‘డ్రైవర్ రాముడు’ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పింది ఈ హాట్ బ్యూటీ. ఈ సినిమా దర్శకుడు రాజ్ సత్య ఐటమ్ సాంగ్ చేయాలని పట్టుబట్టడంతో ఆమె కాదనలేకపోయిందట. దీని కోసం స్కార్లెట్‌కు భారీగా పారితోషికం ఇస్తున్నారట.

Comments

comments